నారాయణ!నారాయణ!!
తెల్లారకుండా వచ్చి కూచున్నావేం నారదా! రాత్రి నిద్రట్టలేదా?
తాతా! తెలుగు గురించి చెప్పవూ?
ఏంటీ! నిన్నొక్కరోజు ఉపవాసంతో పైత్యం చేసిందా? మీ మామ్మని అల్లపు రసం తియ్యమన్నా!
అదేంకాదు తాతా! నిఝంగానే తెలుగురించి చెప్పు.
అవున్లే అరవపాటీ దగ్గర సాంబారు నీళ్ళు తాగుతున్నావు, నీకు తెనుగు గురించి చెప్పాలిసిందే! తెలుగు కాదు తెనుగు అనాలి. తెలిసెనా?
ముందు తెలిసెనా ప్రభూ!
ఈ మందిరమిటులుంచేనా!
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో, కాస్త
ముందు తెలిసెనా!! ప్రభూ
పాటపాడుమా కృష్ణా...
పలుకు తేనెలొలుకునటుల
మాటలాడుమా ముకుంద
మనసు మురియగా...
పాటపాడుమా.......
తెనుగు ఇలా ఉంటుంది.
సమయమాసన్నమైనది.
సమయమా సన్నమైనది.
స్వస్తి
మాటల మరాఠి.
సమయమాసన్నమైనది
ReplyDeleteసమయమా సన్నమైనది
చిరు విరుపు... భాష సొగసు... అద్భుతః
పద విన్యాసం... సరిలేరు మీకెవ్వరూ.
తల్లీ భారతి
Delete''సరిలేరు మీకెవ్వరూ.''
నేను నేనే అంటారనమాట :)
మామ
అయితే “తెలుగు” పదం సరి కాదంటారా శర్మ గారూ? “తెనుగు” అనే మూల పదానికి “తెలుగు” పదం రూపాంతరం అని బ్రౌణ్యంలో ఉందే?
ReplyDeleteవిన్నకోటవారు,
Deleteమీ ప్రశ్నలోనే జవాబుందండి :)
మామ
ReplyDeleteతాతగారికి లు రాదు :)
“ర” పలకని జనాలుంటారు గానీ “ల” రాకపోవడమేమిటండీ “జిలేబి” గారూ, మరీ మీ కొంటెమాటలు కాకపోతే?
Delete
Deleteఈ ప్రశ్న తాతగారికి వేసి వుండాల్సింది :) లు రాదాండీ అని :)
జిలేబి
జిలేబి.
Deleteఅవు”ను”. ఆస్థాన విద్వాంసులకు కూడా”లు” రాదు.
మామ
సమయమాసన్నమైనది.
ReplyDeleteసమయమా సన్నమైనది.
:(
kushalamena miru
ReplyDeleteనారాయణ నారాయణ!
ఈ సమయ మా ....
గట్రా కాపీ భాగోతమటా ! నిజమేనాండీ కష్టేఫలి వారు ?
జిలేబి
మీ పిచ్చిగాని , వారికి
ReplyDeleteకాపీ గట్రాలకన్న కమ్మన తెనుగా ?
వాపును బలుపనుకొని బలు
తీపుల కందాల దురద తీటలె ఘనమౌ .
వెంకట రాజారావు . లక్కాకుల
Deleteఅహో కవి హృదయమర్ధము చేసుకొనలేకపోతి కదా! కట! కటా! :)
Deleteమీకు తెలియదు రాజన్న గారు గ్రేపు వైను కత పోతా వుంది సమయ మా... గట్రా కాపీ (అట).
జిలేబి
మహేశుడు,జిలేబి.
ReplyDeleteబండి నడుస్తోందండి........ ఆగుతుంది,తప్పదుగా..సహజం..అంతే.