Photo courtesy... Sree. Vinnakota Narasimha Rao.
నాకు సినిమాల గురించి తెలిసినది తక్కువ, పల్లెటూరిలో పుట్టి పెరగడం చేత. ఈ నటీనట గాయనీమణులలో కొంతమంది తెలియరు. తెలిసినవారిని వరుసగా.
కూర్చున్నవారు. ... రావు బాలసరస్వతీ దేవి..గాయని లలితగీతాలు,భావగీతాలు. అద్భుత గాత్రం.
కుర్చిలలోవారు. ... మాలతి కొద్దిగా తెలుసు. మాలతిని చూసి భానుమతిగా పొరబడ్డా. శాంత కుమారి పాడవోయిభారతీయుడా.
ఆ తరవాత నటి,గాయని,దర్శకత్వం,రచయిత్రి, వ్యాపారి, ఒకటేమి సినిమా అంటే నిర్వచనం. అభిమానంతో కూడిన భయం. భయంతో కూడిన అత్మీయత. తిరుమతి భానుమతి. మాట కరుకు మనసు వెన్న.
టంగుటూరి సూర్యకుమారి యా?
నిలబడ్డవారు.. నాగయ్య, నాటి హీరో! మనసున్న మనిషి. గోవిందరాజుల సుబ్బారావు. అద్భుత నటుడు. గుండె పట్టేసే లింగమూర్తి.సి.ఎస్. ఆర్ అసలు పేరు సి.ఎస్. ఆర్ ఆంజనేయులు,ఇంటి పేరు తెలీదుగాని సీతారామాంజనేయులు, నటుడు, విలన్ కి నిలువెత్తు రూపు, తడిగుడ్డతో గొంతు కోసే రకం విలనీకి మారు పేరు. నారాయణరావు నాటి హీరో. రంజన్, ఆర్. నాగేశ్వర రావు విలన్ కాకముందు విలన్. రామచంద్రన్ ఆనాటి నటుడు, అప్పుచేసి పప్పుకూడు లో నటించినట్లు గుర్తు.
మిగిలినవారు తెలియదు. కొంతమంది లేరు. అందులో ముఖ్యులు బొడ్డపాటి,విన్నకోట.
ఫోటో పెద్దది గా ఇచ్చాను, ఇబ్బంది లేకుండా గుర్తించడానికి. ఎందరు సజీవులో తెలియదు. వీరంతా ఆల్ ఇండియా రేడియో లో సమావేశానికి సూత్రధారి కెమెరా వెననకుండిపోయినట్టుంది.
No comments:
Post a Comment