Sunday, 21 July 2019

ఇళాపంచమి

Courtesy:Whats app

ఇళాపంచమి

ఇద్దరు భార్యలని పెళ్ళి చేసుకోవచ్చా? ఒకసారి ఇద్దరిని కట్టుకుంటే తప్పు లేదా? ఏమో లా తెలిసినవారు చెప్పాలి. కాని శ్రీనాథుడు మాత్రం ఇలా అనేశారు.

సిరిగలవానికి జెల్లును 
తరుణుల పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.

డబ్బున్నవాడు పదహారు వేలమందినైనా పెళ్ళి చేసుకోవచ్చు. ఇది శ్రీకృష్ణుని పై ఎత్తిపొడుపు, ఆయన పదారు వేల మందిని పెళ్ళి చేసుకున్నాడు, వారు కోరితేనే. ఎవరిదగ్గ వారికే స్వంతమైనట్లూ ఉన్నాడన్నారు. ఎందుకు చేసుకోగలిగాడు ఆయనకేం సొమ్ముందిగనక పదారు వేలమందిని చేసుకున్నాడు. పరమేశ్వరా! నీవేమో బిచ్చగాడివా!! నీకు ఇద్దరు పెళ్ళాలా? చాలు చాలు ఒకతినే పోషించలేనివాడికి ఇద్దరు పెళ్ళలెందుకయ్యా! ఒకదాన్ని వదిలెయ్యమన్నాడు. సరే అది కూడా నిర్దిష్టం చేసి చెప్పేసేడు, ఆవిడే తనకు కావాలట, అదే గంగ అని తేల్చి చెప్పేడు. కవయః నిరంకుశః అన్నారు గాని మరీ ఇంత నిరంకుశత్వమా? అనిపించింది. కొంచం నీళ్ళివ్వయ్యా అని అడగచ్చుగా!

ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో జేరేం కదూ. ఇళా పంచమి అన్నది ఆషాఢ శుద్ధ పంచమి. ఈ రోజు వివాహం చేసుకోవచ్చంటారు. ఆషాఢ మాసంలో పెళ్ళి నిషిద్ధం,కాని ఈ ఒక్కరోజు వివాహం చేసుకోవచ్చట. అది కూడా ఎప్పుడంటే మిడసరలగ్గం అంటారు చూడంది అదే ఇది. అనగా సూర్యుడు నడినెత్తికి వచ్చేవేళ అనగా అభిజిత్ లగ్నం. అభిజిత్ లగ్నం అనగా సూర్యోదయానికి ఉండే లగ్నం నుంచి 4వ లగ్నం అనగా, ఆషాఢంలో సింహలగ్నం తో తూరుపు తెల్లవారుతుంది, దాని నుంచి  4వలగ్నం మిట్టమధ్యాహ్నానికి  వృశ్చికలగ్నం వస్తుంది. (Roughly 11.30to 12.20) అప్పుడు వివాహం చేసుకోడానికి మరేం చూడక్కర లేదంటారు. ఈ లగ్నం లో ఆషాఢ శుద్ధ పంచమి రోజున ఇళా దేవిని శ్రీ కృష్ణుడు వివాహం చేసుకున్నాడట. అదండి ఇళాపంచమి మాట.   ఇక అభిజిత్ లగ్నంలో మొదలు పెట్టిన ఏపని ఐనా నిర్విఘ్నంగా జరుగుతుందంటారు, దీనికి తిథి,వార,నక్షత్రాలతో, వర్జ్యం,దుర్ముహూర్తం లతో నిమ్మిత్తం లేదని ఉవాచ.  

 వీడియోలో పెళ్ళి కొడుకు అదృష్టవంతుడు. ఒకదాన్ని పెళ్ళి చేసుకుందామన్నా ఆడ పిల్లలు దొరకని కాలం, బ్రహ్మచారులు ముదురు బెండకాయల్లా ఐపోతున్న కాలంలో ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. డబల్ ధమాకా!
 నేడు ఆషాఢ బహుళ పంచమి. 

31 comments:


  1. ఒకరు జిలేబి మరొకరు బిలేజి :) వీడియో రావట్లే :)



    జిలేబి

    ReplyDelete
    Replies

    1. Zilebi

      ఇద్దరు జిలేబిలే! ఐతే కొద్ది సద్దుబాటు కనపడుతోంది ఇద్దరిలోనూ. నేనంటే నేననక తనవంతుకోసం వేచి ఉన్నారు. సంసారం గుట్టుగానే సాగిపోతుంది. ఫరవాలేదు. ఐతే బయటనుంచి పుల్లలు పెట్టేవాళ్ళే చుట్టూ కనపడుతున్నారు :)దానికి లొంగిపోయారా,బతుకు బస్టాండే!

      వీడియో చక్కహా వస్తోంది,రిఫ్రెష్ చేసి చూడండి. దేశంలో కొచ్చాకా చూపు గినా మందగించిందా?

      Delete
    2. అభిజిత్ లగ్నం ఎలా కనుగునేవారో తెలుసా! పళ్ళెంలో నీళ్ళు పోసి రోకలి నిలబెట్టేవారు. రోకలి నీడ బయట, రోకలి మీద కూడా కనపడక పోయిన సమయమే అభిజిల్లగ్నం అని నిర్ణయం చేసేవారు. ఇలా నిర్ణయం చేసేవారేం పండితులు వాచీలు చూసినవారు కాదు, అక్షరం ముక్క రాని పల్లెవాసులు, వీరికి సైన్స్ తెలుసా? కాదు వీరికే సైన్స్ తెలుసు.

      Delete


  2. చూపేమైనా మంద
    మ్మా? పాపమ్మా జిలేబి మసకల్ బారే
    నా? పని గట్టుకొనెచ్చే
    వా? పద యేడగలవే బువా!చెప్పమ్మీ :)


    బిలేజి

    ReplyDelete
    Replies
    1. Zilebi
      వీడియో వచ్చిందా? ఇద్దరూ అప్ప చెల్లి లాగా కనపడుతున్నారు,అందుకే ఆ సద్దుబాటొచ్చిందేమో!కజ్జాకోరు జిలేబిలు కాదులా వుంది.

      Delete
  3. రాజేంద్రప్రసాద్ "అప్పుల అప్పారావు" సినిమాలోలాగా ఉంది. అది సినిమా. కానీ నిజ జీవితంలో? అదీ ఇంత బాహాటంగానా? ఈ విడియో ఆధారంగా ఆ పెళ్ళికొడుకు పైన కేసు పెట్టచ్చు కదా?

    ఈ వీడియోలోని పెళ్ళికూతుళ్ళు అక్కచెల్లెళ్ళ లాగా కనపడుతున్నారు అని మీరంటున్నారు కాబట్టి సరే. కానీ వేరే రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే (bigamy) శిక్ష ఏమిటి అన్న దాని మీద ఒక ఆంగ్ల జోక్ 👇:-
    Q.:- Do you know the punishment for bigamy?
    Ans :- Two mothers-in-law.

    ReplyDelete
    Replies

    1. కాంప్లయింసు ఆఫీసరు‌ వారి కొర్రీలు :)

      Delete
    2. విన్నకోటవారు,

      మీరన్నది పాయింటే గాని దీనికో జాయింటు.

      ఇద్దరు భార్యలు కలిగి ఉండడం నేరం!
      ఎప్పుడూ?
      సీనియర్ భార్యకి తెలియనివ్వక జూనియర్ని చేసుకున్నపుడు. పెద్దిల్లు కి తెలియ్నివ్వక చిన్నిల్లు పెట్టినపుడు. అప్పుడూ సీనియర్ కంప్లైంట్ ఇస్తేనే సుమా! ఇంతుంది లాలో.

      ఇక ఇక్కడ ఇద్దరూ అప్పచెల్లెళ్ళలా ఉన్నారనుకున్నం కాని నిజమో కాదో తెలియదు కదా!ఏమైనా ఇద్దరూ ఒకసారే పెళ్ళి చేసుకుంటున్నారు కనక అందరికి ఆమోదయోగ్యమే కదా! ఇందులో మరో మాట లేదు కనక లా తిన్నగానే ఉంది, ఖులాసా పురుషుడిదే ఆనందం.
      Q.:- Do you know the punishment for bigamy?
      Ans :- Two mothers-in-law.
      Hundred percent true :)

      Delete
    3. VNR Sir,
      It is only one marriage with two women. Your lordship there should be no second marriage. This marriage don't come under bigamy.

      Delete
    4. Sir,
      One should not marry twice as per law but the same law is not forbidding that one should not marry two girls at a time your lordship

      Delete
    5. "లాయర్" గారూ,

      ఇద్దరమ్మాయిలను ఒకేసారి పెళ్ళిచేసుకోవడం చట్టంలో ప్రత్యేకించి నిషేధించబడలేదేమో గానీ చట్టం యొక్క ఉద్దేశాన్ని గ్రహించవలెను కదా. Chapter-II, The Hindu Marriage Act 1955 లో .......

      "5. Conditions for a Hindu Marriage: - A marriage may be solemnized between two Hindus, if the following conditions are fulfilled, namely :-"

      అని చెబుతోంది. ఇక్కడ " two Hindus" అన్న పదాలు గమనించండి. ఇద్దరి మధ్య అంటున్నాడు,

      ఉదాహరణ .... పెళ్ళికొడుకు, ఇద్దరు పెళ్ళికూతుళ్ళు ఉన్నారనుకుందాం పీటల మీద. ఒకరి తరువాత ఒకరికేగా తాళి కట్టేది. మొదటి అమ్మాయికి తాళి కట్టాడు, దానితో ఆమె అతని భార్య అయిపోయింది. అది ఇద్దరి మధ్యేగా అనవచ్చు, కరక్ట్. తరువాత రెండో అమ్మాయికి తాళి కట్టడానికి ఉపక్రమించాడు. అది కూడా ఇద్దరి మధ్యేగా అంటారేమో? కానీ అప్పటికే మొదటి అమ్మాయి అతని భార్య అయిపోయిందిగా (ఒక్క నిమిషం క్రితమే అయినప్పటికీ). ఇప్పుడు రెండో అమ్మాయికి తాళి కడితే ..... మొదటి భార్య బతికే ఉంది, విడాకులవలేదు కాబట్టి అది బైగమీయే (bigamy) అవుతుంది కదా "లాయర్" గారూ? 🙂

      " Any marriage between two Hindus solemnized after the commencement of this Act is void if at the date of such marriage either party had a husband or wife living; and the provisions of sections 494 and 495 of the Indian Penal Code (XLV of 1860) shall apply accordingly." (Chapter-II, The Hindu Marriage Act 1955)

      ఏతావాతా --> మొదటి భార్య జీవించేయుండగానూ, విడాకులు మంజూరవకుండానూ మరో పెళ్ళి చేసుకోవడం "బైగమీ"గా పరిగణించబడుతుంది, శిక్షార్హం అవుతుంది ... అని చట్టం చెబుతోందని నాకనిపిస్తోంది 🙏.

      Delete


    6. హేవిటో ! ఈ ముదుసలి లాయర్ల " తాళి" పై వాగ్వివాదాలు ! సహజీవన కాలంలో‌ తాళీ తలంబ్రాలు, తంతు నానేన హిందు మ్యారేజీ యేక్టు గట్రా పట్టుకుని వేలాడుతున్నారు :)



      బ్రేవ్ :(
      జిలేబి

      Delete
    7. Live-in Relationships (Regularisation) Act లాంటిదేదన్నా వచ్చే వరకు తప్పదు కదా, "నారద/నారది" గారూ?

      అన్నట్లు, నేను ckp ను కాదు.

      Delete
    8. Your lordship

      చట్టం చేసేవారు, అమలు చేసేవారే బలవంతులు కదు సార్!

      చిన్న విన్నపం! ఒకరికి తాళి కట్టి న తరవాత మరొకరికి కడితే అప్పటికే ఒక భార్య ఉండగా లా పాయింట్ చెప్పేరు, సబబే! ఇద్దరికి ఒకసారే చెరొకచేత్తో తాళి మెడలో వేస్తే ఏమవుద్ది సార్!

      చట్టం ఉద్దేశాలు సరిగా నిర్వచించబడాలంటే ఒకరికంటే ఎక్కువ మందిని ఒకసారి కూడా వివాహం చేసుకోకూడదని చట్టం లో స్పస్టం గా రాసుండాలి కదు సార్! చట్టం ఉద్దేశం ఏదననే చెప్పచ్చేమో కదు సార్!

      పెళ్ళి అయిందా లేదా అంటే తాళి కట్టటం, జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టడం అని చట్టం నిర్వచిస్తోందట. మరి అదేచట్టం కులాచారల ప్రకారంగా నిర్ణయం కూడా పెళ్ళి ఐనట్టుగానే చెబుతోందిట. ఈ కులాచారం ప్రకారం ఇద్దరిని ఏకకాలంలో చేసుకోవచ్చు. అలా చేసుకోవడం నేరం అని చట్టం చెప్పలేదు. కాదు. అలా చట్టంలో చెప్పబడలేదు కూడా కదండీ!

      Delete
    9. జిలేబమ్మ,

      పెళ్ళి,తాళి,తలంబ్రాలు, మేళాలు,తాళాలు లేకపోయిన సహజీవనమైనా, వివాహం కానంతలో ఇవేమీ అప్లై కావనుకోవద్దని చెబుతోండిట చట్టం, సగం ఆస్థి ఇచ్చి విడిపొమ్మంటోంది, సరేనా?

      ముసలి లాయర్లకి డాక్టర్లకే గిరాకీ ఎక్కువ జిలేబమ్మా! పనిలేక ఖాళీ గా ఉంటారు కదా అందుకు లా పాయింట్లు బాగా లాగుతారు.

      Delete
    10. విన్నకోటవారు,

      చట్టాన్ని తమకి కావలసినట్టుగా వ్యాఖ్యానించగల మేధావులున్నారు.చట్టం నిండా కావలసినన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. నోరున్నవాడిదే రాజ్యం. ఇద్దరమ్మాయిలు ఒకణ్ణి కట్టుకోవడం సాంఘిక అనాచారమని, దురాచారమని చుట్టూ ఉన్నజిలేబిలకే అనిపించలేదంటే ఘోరం కదా! చుట్టూ ఉన్నవారే దానిని అరికట్టలేకపోవడం వింత.

      నా వాదన మీ కు వింతగానూ, వితండం గానూ అనిపించి ఉండచ్చు,నా ఉద్దేశం మాత్రం పైమాటే సుమా! చట్టాలు మాత్రమే ఇలాటి దురాచారాలను అరికట్టలేవు. ఇప్పటికి బాల్య వివాహాల దురాచారం కొనసాగుతోంది అక్కడక్కడా! ఇలాగే మిగిలినవీ, మేధావులమని దచ్చీలు కొట్టేవారికి కనపడవేమో!

      Delete


  4. ఆషాడంబాఫరిదే
    సోషల్మీడియ జిలేబి సొబగుల్ చూడా
    లే!షాదీహోనాతో
    భేషగు నిరుపత్నులే సుబేహ్ ఔర్ షామ్ కో :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi
      అదిరిందయ్యా చంద్రం లాగా
      పద్యం అదిరింది తెలుగు,ఇంగ్లీషు, హిందీ,ఉరుదు.సంస్కృతం వాహ్వా జిలేబమ్మా! నీకు నువ్వే సాటి! జిలేబమ్మ పేరు బాగుంది అలాగ్గానిద్దాం!

      Delete
  5. అభిజిల్లగ్నం బహుశ్రేష్ఠం. సందేహం లేదు. అస్సలు దోషం లేని ముహూర్తం కావాలంటే ఏడాదిలో ఒక్కటీ దొరక్కపోవచ్చును. అందుచేత ఎంత పంచకరహితం చేసి పెట్టిన ముహూర్తం ఐనా ఏవో కొన్ని దోషాలు ఉండనే ఉంటాయి. కాని అభిజిల్లగ్నం ఐతే దానికి తిరిగులేదు. అందుచేత ఏడాదిలో ఏరోజైనా అభిజిత్తులో వివాహం ఆమోదమే. ఇళాపంచమి అనే కాదు ఏరోజైనా సరే. మూఢమి దినాలైనా ఫరవాలేదు. ఒక్క సూర్యగ్రహణం నాడు మాత్రం కూడదని నాఅ అభిప్రాయం.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు,

      నాకీ మిడసర లగ్గం, పల్లెటూరి వాళ్ళు ఇలాగే అంటారండి అదే అభిజిల్లగ్నం అంటే చాలా ఇష్టం. జీవితంలో చాలా సార్లు ఉపయోగించుకున్నా! బాదరబందీలు లేని మంచి ముహూర్తం. ఎవ్వరిని అడగక్కరలేదు. మన నీడ మన నెట్టిన పడుతున్నదే ఆ సమయం,చాలు. ఇంతకు మించినదీ లేదు.

      అభిజిత్తు లో వివాహం బహు శ్రేష్టం కాని జనం వినరు, ఏం చెయ్యలేం. సూర్య గ్రహణం రోజు కూడదన్నారు, ఆ సమయానికి గ్రహణం ఉంటేననా మీ అభిప్రాయం?

      పదోన్నతి కోసం నా చదువును అభిజిల్లగ్నంలో అమావాస్యనాడు మొదలెట్టాను.తెలుగువారు అమావాస్య అంటే భయపడతారు గాని తమిల్ వారు అమావాస్యను గొప్పగా చూస్తారు.

      Delete
  6. శర్మ గారు,

    భారతదేశ చట్టాల ప్రకారం ....

    (1). మొదటి భార్య జీవించి ఉండగా గానీ;
    (2). మొదటి భార్యకు కోర్టు ద్వారా విడాకులివ్వకుండా గానీ;
    (3). మొదటి భార్య ఆచూకి లేకుండా పోయి ఏడు సంవత్సరాలు నిండక ముందు గానీ;

    రెండో పెళ్ళి చేసుకుంటే అది నేరమే.

    మొదటి భార్యకు విడాకులివ్వకపోయినా ఆమె చేత అనుమతి పత్రం వాయించుకున్నా (సినిమాలల్లో చూపించినట్లు) కూడా చట్టం ఒప్పుకోదట.
    ఈ క్రింది లింక్ చూడండి.

    Bigamy :: రెండో పెళ్ళి

    కావున ఇద్దరు ఆడవాళ్ళూ ఒకేసారి చేసుకుంటున్నారు గనక, అందరికీ ఆమోదయోగ్యమే ... కాబట్టి ఓకే ... అన్నా కూడా చట్టానికి ఆమోదయోగ్యం కాకపోవచ్చేమోనండీ 🤔?

    అయినా మనకేల ఈ గోల? ఆ "ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు"కు కొత్తలో బాగానే ఉంటుందేమో గానీ ముందుంది మొసళ్ళ పండగ, పాపం వెర్రివాడు 😂 (ఇప్పటికే అతనికి నెత్తి మీద సగం జుట్టు రాలిపోయినట్లు కనిపిస్తోంది విడియోలో 🙂).

    ReplyDelete
    Replies
    1. అదేలెండి, మీరన్నట్లు సీనియర్ భార్య దృష్టికి వెళ్ళి ఆవిడ కంప్లైంట్ ఇస్తేనే లెండి .. కేసు బుక్కయ్యేది.

      Delete
    2. విన్నకోటవారు,

      చట్టం చాలా చెబుతుందండి. :) దాన్ని మన అవసరానికి తగినట్టుగా మలుచుకోడమే లాయర్లు చేసేపని. అందరికి ఇష్టమైతే సమస్యలేదు కదా! నా హక్కు భంగపడిందని సీనియర్ గొడవ చేస్తే కదా సమస్య. ఇప్పుడిక్కడ సీనియర్ జూనియర్ సమస్య లేదు. వాళ్ళిద్దరూ ముద్దుల మొగుడితో గొడవలేకుండా బతికేయాలని ఆశీర్వదించేద్దాం!

      తరవాత కాలంలో గంగా గౌరి ఐపోతే అనుభవిస్తాడు, సుఖం వెనకే కష్టం కదండీ. వరసకో మావ ఉండేవాడు. ఇద్దరు అప్పజెల్లెళ్ళు. ముందు అక్కను పెళ్ళి చేసుకున్నాడు, తరవాతెప్పుడు జేరబడిందో చెల్లెలూ జేరబడిపోయింది. పెళ్ళి చేసుకున్నాడు, తప్పని సరి పరిస్థితి వస్తే! గంగా గౌరి సంవాదం, చిద్విలాసంగా బాసిన పీట వేసుకుని వీధిలో కూచునేవాడు. మావా ఏంటి తగువంటే ఈ రోజేం వారమనేవాడు. నేనడిగిందానికి నువ్వు చెప్పిందానికి లింకేంటి మావా అంటే. వారమేంటో చెప్పరా అనేవాడు. వారం చెబితే ఈ వేళ పెద్దత్త వంతురా అదీ తగువు అని నవ్వేసేవాడు. అర్ధమయ్యేది కాదు. :)

      Delete
    3. 😀😀
      అయినా అటువంటి "అగ్రిమెంట్" ముందస్తుగానే చేసుకునుండాలి కదా? దాని ప్రకారం నడిపించుకోవడమే 😀😀.

      Delete
    4. విన్నకోటవారు,
      ఈ పెళ్ళి పీటలమీదకొచ్చేలోపు ఎన్ని ర గణ,భ గణ, స గణాలు జరిగుంటాయో! ఎన్ని ఒప్పందాలు జరిగుంటాయో ఊహించడం కష్టమండి. :) ఎంతమంది జిలేబులు చర్చ రచ్చ చేసి ఉంటారో! :) ఎన్ని తీర్మానాలు జరిగాయో! ఏదో పెద్ద కారణం లేక ఇటువంటివి జరగవండి.

      ఐనా తగువెలా వస్తుందో చెప్పడం కష్టమండి. పెద్దత్త వంతైతే తగువెందుకూ అడిగానండి మావని. ఒరే కుర్రాడా నువ్వు చెప్పందే వదిలా లేవని చెప్పేడు. చిన్నత్త అందంగా ఉంటుంది కదా, పెద్దత్త కొంచం మోటు, మొన్న చిన్నత్త వంతు రోజు త్యాగం చేసింది, ఒంట్లో బాగోక. అది బాకీ అంటుంది చిన్నత్త కాదు బాకీ ఎలా అవుతుందంటుంది పెద్దత్త అదీ తగువు, సరేనా అన్నాడు. వదిలితేనా మావా ఇద్దరూ స్టయిక్ చేస్తే అడిగా, అరుగుంది కదరా సమాధానమిచ్చాడు. అయ్యా! అదండి ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడి కథ.

      Delete
    5. అహ్హహ్హహ్హ. పాపం చిన్నత్తకు రావలసిన బాకీయే కదా న్యాయంగా చూస్తే 😀. అంతేలెండి, తగువులు ఎటునుండి ఎలా మొదలవుతాయో చెప్పలేం 🙂. మొత్తానికి మీ మావయ్య గారు "నారీ నారీ నడుమ మురారి" లాగా వెలిగిపోయేరన్నమాట 🙂.

      Delete
    6. విన్నకోటవారు,

      రెండేళ్ళపాటు చూసిన సీరియల్ కతండి, మీరన్నట్టూ అడిగేసేనండి, నిజం కదా చిన్నత్త బాకీ తీర్చాల్సిందే కదా, నువ్వు తగువు తీర్చచ్చు కదా అని. దానికి తగువు తీర్చి వీధరుగు ఖాయం చేసుకోమన్నావురా కుర్రాడా? లౌక్యం కావాలిరా! సాయంత్రానికి సఖ్యతపడి ఎవరో ఒకరు వంతుకొస్తార్లే అనేశాడు.

      ఇది అంతు లేని కతండి. :)

      Delete
    7. అనుభవం, సర్, అనుభవం నేర్పిన జాగ్రత్త 🙂.

      Delete
    8. విన్నకోటవారు,
      అంతే కదండీ!ఎన్నెన్ని రకాల తగువులండి!! సాయంత్రానికన్నీ సద్దుకునీవండి

      Delete