తెలివి తక్కువ వాళ్ళు ఇళ్ళు కడతారు, తెలివైనవాళ్ళు కాపరం ఉంటారు.
Sunday, 28 July 2019
Thursday, 25 July 2019
Wednesday, 24 July 2019
Sunday, 21 July 2019
ఇళాపంచమి
Courtesy:Whats app
ఇళాపంచమి
ఇద్దరు భార్యలని పెళ్ళి చేసుకోవచ్చా? ఒకసారి ఇద్దరిని కట్టుకుంటే తప్పు లేదా? ఏమో లా తెలిసినవారు చెప్పాలి. కాని శ్రీనాథుడు మాత్రం ఇలా అనేశారు.
సిరిగలవానికి జెల్లును
తరుణుల పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.
డబ్బున్నవాడు పదహారు వేలమందినైనా పెళ్ళి చేసుకోవచ్చు. ఇది శ్రీకృష్ణుని పై ఎత్తిపొడుపు, ఆయన పదారు వేల మందిని పెళ్ళి చేసుకున్నాడు, వారు కోరితేనే. ఎవరిదగ్గర వారికే స్వంతమైనట్లూ ఉన్నాడన్నారు. ఎందుకు చేసుకోగలిగాడు ఆయనకేం సొమ్ముందిగనక పదారు వేలమందిని చేసుకున్నాడు. పరమేశ్వరా! నీవేమో బిచ్చగాడివా!! నీకు ఇద్దరు పెళ్ళాలా? చాలు చాలు ఒకతినే పోషించలేనివాడికి ఇద్దరు పెళ్ళలెందుకయ్యా! ఒకదాన్ని వదిలెయ్యమన్నాడు. సరే అది కూడా నిర్దిష్టం చేసి చెప్పేసేడు, ఆవిడే తనకు కావాలట, అదే గంగ అని తేల్చి చెప్పేడు. కవయః నిరంకుశః అన్నారు గాని మరీ ఇంత నిరంకుశత్వమా? అనిపించింది. కొంచం నీళ్ళివ్వయ్యా అని అడగచ్చుగా!
ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో జేరేం కదూ. ఇళా పంచమి అన్నది ఆషాఢ శుద్ధ పంచమి. ఈ రోజు వివాహం చేసుకోవచ్చంటారు. ఆషాఢ మాసంలో పెళ్ళి నిషిద్ధం,కాని ఈ ఒక్కరోజు వివాహం చేసుకోవచ్చట. అది కూడా ఎప్పుడంటే మిడసరలగ్గం అంటారు చూడంది అదే ఇది. అనగా సూర్యుడు నడినెత్తికి వచ్చేవేళ అనగా అభిజిత్ లగ్నం. అభిజిత్ లగ్నం అనగా సూర్యోదయానికి ఉండే లగ్నం నుంచి 4వ లగ్నం అనగా, ఆషాఢంలో సింహలగ్నం తో తూరుపు తెల్లవారుతుంది, దాని నుంచి 4వలగ్నం మిట్టమధ్యాహ్నానికి వృశ్చికలగ్నం వస్తుంది. (Roughly 11.30to 12.20) అప్పుడు వివాహం చేసుకోడానికి మరేం చూడక్కర లేదంటారు. ఈ లగ్నం లో ఆషాఢ శుద్ధ పంచమి రోజున ఇళా దేవిని శ్రీ కృష్ణుడు వివాహం చేసుకున్నాడట. అదండి ఇళాపంచమి మాట. ఇక అభిజిత్ లగ్నంలో మొదలు పెట్టిన ఏపని ఐనా నిర్విఘ్నంగా జరుగుతుందంటారు, దీనికి తిథి,వార,నక్షత్రాలతో, వర్జ్యం,దుర్ముహూర్తం లతో నిమ్మిత్తం లేదని ఉవాచ.
వీడియోలో పెళ్ళి కొడుకు అదృష్టవంతుడు. ఒకదాన్ని పెళ్ళి చేసుకుందామన్నా ఆడ పిల్లలు దొరకని కాలం, బ్రహ్మచారులు ముదురు బెండకాయల్లా ఐపోతున్న కాలంలో ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. డబల్ ధమాకా!
నేడు ఆషాఢ బహుళ పంచమి.
నేడు ఆషాఢ బహుళ పంచమి.
Friday, 19 July 2019
ఏం పని కావాలి?
ఇల్లు మారాలా?
సామాను పేక్ చేయడం దగ్గరనుంచి ఇల్లు చూసి పెట్టడం దగ్గరనుంచి, సామాను కొత్తింటికి చేర్చి సద్ది పెట్టడం దాకా అన్ని పనులు చేసి పెడతాం.
పండగలకి ఫంక్షన్ లకి ఇల్లు దులపాలా? రంగులేయాలా? కడగాలా? తుడవాలా? మాకు చెప్పండి, చేసి పెడతాం.
ఇంటిలో కరంటు పనులు చిన్నచిన్నవైనా చేయాలా? నీళ్ళ కుళాయిలు బాగు చెయ్యాలా? అలంకరణ చేయాలా? మొక్కలు అలంకరించాలా? మాకు చెప్పండి.
పెళ్ళి చేయించాలా? భోజనాలు పెట్టాలా? ఇంటి దగ్గరే వంట చేయించాలా? ఏ ఆచారంలో పెళ్ళి, భోజనాలు కావాలో చెప్పండి, ఒక గంటలో పెళ్ళి నుంచి ఐదురోజుల పెళ్ళి దాకా అన్ని ఏర్పాట్లూ చేస్తాం. కావాలంటే ఫంక్షన్ హాల్ తో సహా బుక్ చేసి పెడతాం.
అంతెందుకు మీ ఇంట్లో పని ఏదైనా సరే మీకు నచ్చినట్లు చేసి పెడతాం. మిమ్మల్ని చీపురు కావాలి,బ్రష్ కావాలి, ఎత్తు పీట కావాలి అని దేని గురించి అడగం. మాకు ఫోన్ చేయండి. మా సూపర్వైసర్ వచ్చి చూసి పని చూసి సొమ్ము ఎంతవుతుందో చెబుతారు. ఎప్పటిలోగా పని పూర్తి చేయగలమో చెబుతాం. మీ ఇంటిలో సామానుకు మాది పూచీ! ముందుగా వీడియో తీసి మీకిచ్చి దులిపి, కడిగిన తరవాత ఎప్పటిలా సద్ది మళ్ళీ వీడియో మీకిస్తాం. ఏ వస్తువూ బీరు పోదు. మరో ముఖ్యమైన సంగతి, మీ కిచ్చిన తరవాత వీడియో మాదగ్గరుండదు, మళ్ళీ మీరు కావాలన్నా దొరకదు, అంత ప్రైవసీ మెయెంటైన్ చేస్తాం. మీ ఇంటి గురించి మరొక చోట మాట్లాడం.
ఇదివరకు పట్టణాలలో ఈ రకం సర్వీసులున్నట్టు విడ్డూరంగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు పల్లెలలో కూడా ఇవి మొలుచుకొచ్చాయి. ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇదే సందడి.
ఏమాటకామాటే చెప్పుకోవాలి, శుభ్రంగా చేసిపెడుతున్నారు.
Tuesday, 9 July 2019
అల్పజీవి-అర్ధనారి....2
అల్పజీవి-అర్ధనారి.
అంచిత కావ్య కంఠ బిరుదాంకు, అమోఘ వచస్కు,అంబికా
చంచల కింకిణీ నినద సౌమ్య సుసంస్కృత వాగ్విలాసు,ని
శ్చంచల యోగి పుంగవుని, జ్ఞాన విశోధిత లబ్ధ తత్త్వ భా
సాంచిత రాజహంసు,రమణాశ్రమ వాసు నుతింతు "నాయనన్".....6
తెప్పున గారె ముక్కలను తేనెల ముంచుక తిన్న రీతిగా
గొప్పలు కాదుగాని కవికోటి శిరంబుల నూచి మెచ్చగా,
చప్పున నాదు పల్కులకు శంకరుడే విని నవ్వునట్లు; నే
చెప్పెద పద్దెముల్ రసిక శేఖరు లెల్లరు బాగు బాగనన్.....7
చొక్కపు పిల్ల తెమ్మెరల సోకుకు కోయిల కూసినట్లుగన్
చక్కని నాదు భావముల సౌరభమెంచి ప్రశంస చేయగా
నొక్కడు చాలు; లోతెఱుగ కూరక త్రిప్పగ నేల శీర్షముల్
రక్కెస తుప్పలున్ మరియు రావులు తా తలలూపవా! శివా!....8
తూరుపు దిగ్గజంబైన ధూర్జటి తోటి సాటి యౌదనన్
కోరిక నాకు లేదు, మరి కోరెద నాతని చెంత నిల్వగా;
దూరపు చుట్టమై ప్రజకు తోచిన చాలును సంతసించెదన్
సారమ సారమున్ తెలియ సర్వగతుండవు నీవెగా! శివా!........9
సరగున పూర్ణిమా విమల చారుతరోజ్వల చంద్రకాంతికిన్
కరగును చంద్రకాంతములు, కాక ద్రవించున గండ శైలముల్
వరకవి మాధురీగుణ విభాసిత కోమల వాక్యరీతులన్
సరసుడు సంతసించి నటు ఛాందసు డాదర మొందునా! శివా!....10
నింగిని తోచినట్టి నెల నిండిన జాబిలిజూచి సంద్రము
ప్పొంగును, బావి నీళ్ళకును పొంగులు కల్గునె? బిడ్డ ముద్దుమో
ముంగని పాలచే పాదువ మోదము బిడ్డల తల్లి చెందెడిన్
తొంగుడు నాకు చాలనెడి తొత్తుకు పాపడు తీపియా! శివా!.......11
బంగరు సుద్దు లయ్యమరవాణిని గైకొని చెప్పినాడ నే
పొంగుచు కొన్ని పద్దెముల,పూర్వులొసంగిన యాస్తిగాన నీ
వెంగిలి ముక్కలంచు మది నెంచకు, కీరము ముట్టినట్టి యా
రంగగు దోరకాయ ధర రాలిన రుచ్యము గాదటో! శివా....12
అప్పయ శంకరాది ఘనులాత్మ విచారణ దక్షు లందముల్
కుప్పలు గాగ పోసి నిను గొల్చిరి కైతల, వారి ముందు నే
చప్పన యౌదుగాక,విను చక్కెర మెక్కియు పండు చీకుచో
చప్పన గాక ఎప్పుడు రసాలము మెప్పును పొందునా! శివా!....13
లలిత కవిత్వ సంపద ధరాస్థలి నెంతటి భూరి పుణ్యమూ
ర్తులకు లభించు? దాన సరితూగునె రాజ్యము గీజ్య మీ క్షితిన్!
నిలుచును నిత్యుడై కవి మనీషను,తక్కిన వారు మట్టిలో
కలిసెడు వారె, నిల్చు నొక కావ్యము నందిన భర్తయున్ శివా....14
ఒకపద్యము చెప్పువాడె కవియౌ యూరేగు ఈ రోజులం
దొక కావ్యంబు గూర్ప,వాడికను నర్హుండే గదా కాళిదా
సుకు తా పెద్దకుమారుడంచు సకల సర్వజ్ఞుండంచు విద్వాంసులం
దొక లెక్కుంచక నిందసేయ, కలిలో నూహింప వింతల్ శివా!...15
*”నాయన”..కావ్యకంఠ గణపతి ముని.
Friday, 5 July 2019
అల్పజీవి-అర్ధనారి-1
అల్పజీవి-అర్ధనారి
(శివ శతకం)
ఒకవైపు అంచల నూరించు మంజీర - మహిరాజ ఫూత్కర మవలివైపు
స్కందాదిరోహణోత్సంగంబు నొకవైపు - అవ్వల గణపతి నవ్వుమోము
పద్మకాండము మించు బాహువు నొకవైపు - కరితుండమును మించు కరము నవల
ఒకవైపు కుముదాళి గికురించు నయనంబు - నీరజ శ్రీజూపు నేత్రమవల
పారిజాతకలతా పల్లవంబొకవైపు - ఉల్లోల మాలిక లొక్కవైపు
లాస్యమొకవైపు తాండవార్భటియు మెరయ
అమృతకిరణుండు - ఉమ్మడి ఆస్తి కాగ
వెలుగుచీకట్లు కలిసిన విధము తోప
కలిసి కాపుర మొనరించు కలిమిలేము
లనగ రూపించు జంటకు అంజలింతు......1
తేలుచున్నవి నింగి నీలాభ్రములు రెండు - ఒండొంటి నొరయంగ ఉత్సహించి
వ్రాలుచున్నవి లీల బాల మృణాలముల్ - మలయానిలాహతి మలగి మలగి
క్రాలుచున్నవి హేల నీలకంఠంబులు - పురివిప్పి నాట్య వైఖరుల కలిమి
సోలుచున్నవి క్రీడ లీలాకపోతముల్ - కువకువ ధ్వనులతో కవసికవసి
వెలుగు చీకట్లు, కలిమి లేములును, అస్తి
నాస్తులును... ఏవో! ఏవో! అణగి పెనగి
జంట జంటలై.. ఒకటియై సర్వసృష్టి
అర్ధనారీశ్వర విలాసమగుచు తోచు.....2
"హత్తిన ప్రేమ జూచుటకు అమ్మయు నాన్నయు నాకు కల్గగా
నెత్తఱి నెంచి చూచినను ఎక్కువ నేనని గౌరి పల్క,"నా
కత్తయు మామగారు కల"రంచు నవ్విన శూలి నేర్పుకున్
బిత్తరి చూపులన్ నిలిచి "నేర్పరులే" యను గౌరి కొల్చెదన్.....4
రాజిత సుందరానన,పరాజిత రాజమరాళ యాన,వి
భ్రాజిత సుందరాలక,విరాజిత రాజ మనోజ్ఞరూప,ఉ
త్తేజిత సింహవాహన, జితేంద్రియ మానస రాజహంస, సం
పూజిత రాజమౌళి, వర భూషణి, గౌరి శుభంబు లీవుతన్.....5
తేలుచున్నవి నింగి నీలాభ్రములు రెండు - ఒండొంటి నొరయంగ ఉత్సహించి
వ్రాలుచున్నవి లీల బాల మృణాలముల్ - మలయానిలాహతి మలగి మలగి
క్రాలుచున్నవి హేల నీలకంఠంబులు - పురివిప్పి నాట్య వైఖరుల కలిమి
సోలుచున్నవి క్రీడ లీలాకపోతముల్ - కువకువ ధ్వనులతో కవసికవసి
వెలుగు చీకట్లు, కలిమి లేములును, అస్తి
నాస్తులును... ఏవో! ఏవో! అణగి పెనగి
జంట జంటలై.. ఒకటియై సర్వసృష్టి
అర్ధనారీశ్వర విలాసమగుచు తోచు.....2
శంకరు జేరి గౌరి సరసమ్ముగ హాసము లాడు వేళ "ని
శ్శంకను సామి! నేగనుక సైచితి నివ్విధి లేమి కాపురం
బింకొక లేమ యెవ్వతెయు నిట్టుల సైచునె" యంచు బల్క, యా
వంకను జూచి నవ్వు భగవంతుడు శంకరుడిచ్చు కోరికల్....3
నెత్తఱి నెంచి చూచినను ఎక్కువ నేనని గౌరి పల్క,"నా
కత్తయు మామగారు కల"రంచు నవ్విన శూలి నేర్పుకున్
బిత్తరి చూపులన్ నిలిచి "నేర్పరులే" యను గౌరి కొల్చెదన్.....4
రాజిత సుందరానన,పరాజిత రాజమరాళ యాన,వి
భ్రాజిత సుందరాలక,విరాజిత రాజ మనోజ్ఞరూప,ఉ
త్తేజిత సింహవాహన, జితేంద్రియ మానస రాజహంస, సం
పూజిత రాజమౌళి, వర భూషణి, గౌరి శుభంబు లీవుతన్.....5