ఈ వీడియో మా వూరి ఎనభై అడుగుల సిమెంట్ మైన్ రోడ్ మధ్యలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి తీసినది. ఎండ మండిపోతున్న సమయం. వేడి నలభై ఐదు దగ్గరున్న సమయం.. మీరెందు కెళ్ళేరా సమయంలో..? ప్రశ్న కదా! ’ఇరుసున కందెన బెట్టక’ కదండీ, కందెనకోసం పోక తప్ప లేదు....
ఇలా ముంజల కోసం ఆగేనో పావు గంట....ఇప్పుడు కూడా అంటే తెల్లవారు గట్ల నాలుగున్నర ఐదు సమయంలో కూడా ముఫై దాటి వేడి ఉన్నది.
మరో మాట అతను చదువుకోనివాడు ఏమీ తెలియనివాడే! కాని చెవులను రక్షిస్తూ తువ్వాలు టోపీలా చుట్టుకున్నాడు, అంత ఎండ,వేడి నుంచి రక్షించుకున్నాడు....
ఒకరెవరోగాని అన్నిటికి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం కదా! తండ్రి,తల్లి ఆబ్దీకం నుంచి గ్రహణం దాకా! మరి ఎండలు మాత్రం ఎందుకొదిలెయ్యాలని.......మండుటెండల శుభాకాంక్షలు చెప్పేసేరు. :) వాట్సాప్ లో. అవునండి ఎండలేక వానలేదు, వాన లేక బువ్వలేదు... :) నిన్న ౪౪ మొన్న ౪౬ మరీవేళ కూడా ౪౬ దాటచ్చంటోంది గూగులమ్మ! సూరయ్యగారి దయ మా ప్రాప్తం!
// “మరో మాట అతను చదువుకోనివాడు ఏమీ తెలియనివాడే! కాని చెవులను రక్షిస్తూ తువ్వాలు టోపీలా చుట్టుకున్నాడు, అంత ఎండ,వేడి నుంచి రక్షించుకున్నాడు.... ” //
బాగా చెప్పారు శర్మ గారూ. నా పాతికేళ్ళ వయసప్పుడు జరిగిన ఒక వేసవికాలపు సంఘటన గుర్తొచ్చింది. మండే ఎండలకు ప్రసిద్ధి గాంచిన ఖమ్మంలో ఉద్యోగం ... బదిలీ మీద (సన్నిహితులతో అంటుండేవాడిని మీ ఊళ్ళో మూడే సీజన్లండీ - మైల్డ్ సమ్మర్, సమ్మర్, సివియర్ సమ్మర్ - అని 🙂). ఎండాకాలంలో (సివియర్ సమ్మర్ అన్నమాట 🙂) ఒక ఆదివారం మిట్ట మధ్యాహ్నం ఏమీ తోచకుండా ఉంటే (టీవీలు, సెల్-ఫోన్లు ఇంకా రాని రోజులు) సహోద్యోగి రూముకు వెడదామని బయలుదేరాను. వయసు నిర్లక్ష్యం కదా ... వెన్నెలలో నడుస్తున్నట్లు నడుస్తున్నాను. ఎండ వల్ల కాస్త నిర్మానుష్యంగా ఉన్న ఆ వీధిలో తల మీద చీరచెంగు కప్పుకుని ఒక నడివయసావిడ నా ఎదురుగా వస్తోంది. నా దగ్గరకు రాగానే నన్ను ఆపి ... నెత్తి మీద దస్తీ యైనా వేసుకో బిడ్డా ... అన్నది (దస్తీ = చేతిరుమాలు). ఆ రోజున ఆ అపరిచితురాలు (పెద్ద చదువుకున్న వ్యక్తిలాగా నాకనిపించలేదు) అన్న ఆ మాటలు నాకిప్పటికీ గుర్తొస్తుంటాయి 🙏.
నా చిన్నతనంలో గమనిస్తుండేవాడిని పెద్దవాళ్ళు బయటకు వెడుతుంటే తప్పక గొడుగు, చేతిసంచీ తీసుకుని బయలుదేరేవారు. ఎండ నుండి రక్షణకు గొడుగు (అనుకోకుండా వాన వస్తే దాన్నుండి రక్షణకు కూడా), బయలుదేరినప్పుడు బజారుకని అనుకోకపోయినా దారిలో గుర్తొచ్చి / కనిపించి ఏవైనా కొంటే వాటికోసం చేతిసంచీ. ఆ ఆలోచనా ధోరణులే వేరు 🙏.
విన్నకోటవారు, వడ కొట్టకుండాలంటే చెవులను కప్పుకోవాలి, వేడి తగలకుండా చూసుకోవాలి. అది చాలా ముఖ్యం. అది చేసాడితను తువ్వాలు టోపీలా చుట్టుకుని చెవులు కప్పేసేడు. ఎండలో ఉండేవారు తలకు ముఖ్యంగా చెవులకు రక్షణ తీసుకోవాలి.
ఆహా, చూస్తుంటేనే ముంజల చల్లదనం అనుభూతిలోకొస్తోందండి 👌😋.
ReplyDelete
ReplyDeleteఆహా చూస్తుంటేనే
వాహో! చల్లదన మనుభవమ్మున కొచ్చెన్
సాహో ముంజెల తోడుగ
నే హాయినిగాంచెదనిదె నే నిచ్చటనే :)
జిలేబి
This comment has been removed by the author.
ReplyDeleteవిన్నకోటవారు,జిలేబి గారు.
ReplyDeleteఈ వీడియో మా వూరి ఎనభై అడుగుల సిమెంట్ మైన్ రోడ్ మధ్యలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి తీసినది. ఎండ మండిపోతున్న సమయం. వేడి నలభై ఐదు దగ్గరున్న సమయం.. మీరెందు కెళ్ళేరా సమయంలో..? ప్రశ్న కదా! ’ఇరుసున కందెన బెట్టక’ కదండీ, కందెనకోసం పోక తప్ప లేదు....
ఇలా ముంజల కోసం ఆగేనో పావు గంట....ఇప్పుడు కూడా అంటే తెల్లవారు గట్ల నాలుగున్నర ఐదు సమయంలో కూడా ముఫై దాటి వేడి ఉన్నది.
మరో మాట అతను చదువుకోనివాడు ఏమీ తెలియనివాడే! కాని చెవులను రక్షిస్తూ తువ్వాలు టోపీలా చుట్టుకున్నాడు, అంత ఎండ,వేడి నుంచి రక్షించుకున్నాడు....
ఒకరెవరోగాని అన్నిటికి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం కదా! తండ్రి,తల్లి ఆబ్దీకం నుంచి గ్రహణం దాకా! మరి ఎండలు మాత్రం ఎందుకొదిలెయ్యాలని.......మండుటెండల శుభాకాంక్షలు చెప్పేసేరు. :) వాట్సాప్ లో. అవునండి ఎండలేక వానలేదు, వాన లేక బువ్వలేదు... :) నిన్న ౪౪ మొన్న ౪౬ మరీవేళ కూడా ౪౬ దాటచ్చంటోంది గూగులమ్మ! సూరయ్యగారి దయ మా ప్రాప్తం!
ముంజలు బాగున్నాయండి.
Deleteచెప్పితి మబ్ధికములకున్
తప్పక శుభకామనలను తరుణంబదియో
నొప్పో కాదో చూడక
నప్పా నరసింహ రాయ నాలాయకిగాన్!
జిలేబి
// “మరో మాట అతను చదువుకోనివాడు ఏమీ తెలియనివాడే! కాని చెవులను రక్షిస్తూ తువ్వాలు టోపీలా చుట్టుకున్నాడు, అంత ఎండ,వేడి నుంచి రక్షించుకున్నాడు.... ” //
ReplyDeleteబాగా చెప్పారు శర్మ గారూ.
నా పాతికేళ్ళ వయసప్పుడు జరిగిన ఒక వేసవికాలపు సంఘటన గుర్తొచ్చింది. మండే ఎండలకు ప్రసిద్ధి గాంచిన ఖమ్మంలో ఉద్యోగం ... బదిలీ మీద (సన్నిహితులతో అంటుండేవాడిని మీ ఊళ్ళో మూడే సీజన్లండీ - మైల్డ్ సమ్మర్, సమ్మర్, సివియర్ సమ్మర్ - అని 🙂). ఎండాకాలంలో (సివియర్ సమ్మర్ అన్నమాట 🙂) ఒక ఆదివారం మిట్ట మధ్యాహ్నం ఏమీ తోచకుండా ఉంటే (టీవీలు, సెల్-ఫోన్లు ఇంకా రాని రోజులు) సహోద్యోగి రూముకు వెడదామని బయలుదేరాను. వయసు నిర్లక్ష్యం కదా ... వెన్నెలలో నడుస్తున్నట్లు నడుస్తున్నాను. ఎండ వల్ల కాస్త నిర్మానుష్యంగా ఉన్న ఆ వీధిలో తల మీద చీరచెంగు కప్పుకుని ఒక నడివయసావిడ నా ఎదురుగా వస్తోంది. నా దగ్గరకు రాగానే నన్ను ఆపి ... నెత్తి మీద దస్తీ యైనా వేసుకో బిడ్డా ... అన్నది (దస్తీ = చేతిరుమాలు). ఆ రోజున ఆ అపరిచితురాలు (పెద్ద చదువుకున్న వ్యక్తిలాగా నాకనిపించలేదు) అన్న ఆ మాటలు నాకిప్పటికీ గుర్తొస్తుంటాయి 🙏.
నా చిన్నతనంలో గమనిస్తుండేవాడిని పెద్దవాళ్ళు బయటకు వెడుతుంటే తప్పక గొడుగు, చేతిసంచీ తీసుకుని బయలుదేరేవారు. ఎండ నుండి రక్షణకు గొడుగు (అనుకోకుండా వాన వస్తే దాన్నుండి రక్షణకు కూడా), బయలుదేరినప్పుడు బజారుకని అనుకోకపోయినా దారిలో గుర్తొచ్చి / కనిపించి ఏవైనా కొంటే వాటికోసం చేతిసంచీ. ఆ ఆలోచనా ధోరణులే వేరు 🙏.
విన్నకోటవారు,
Deleteవడ కొట్టకుండాలంటే చెవులను కప్పుకోవాలి, వేడి తగలకుండా చూసుకోవాలి. అది చాలా ముఖ్యం. అది చేసాడితను తువ్వాలు టోపీలా చుట్టుకుని చెవులు కప్పేసేడు. ఎండలో ఉండేవారు తలకు ముఖ్యంగా చెవులకు రక్షణ తీసుకోవాలి.
జిలేబి మేడమ్ గారు పద్యాలు చదువుతూ ఒక వీడియో చేస్తే బాగుంటుంది. అది వాట్సప్ లో వైరల్ అవుతుంది.
ReplyDeleteబుచికి గారు,
Deleteఅరవ పాటీ తో తెలుగు పద్యాలు చదివించడం! బలే కోరికండి. :)