Sunday, 26 May 2019

రోహిణీ కార్తె ముచ్చట్లు


Courtesy:Whats app
రోహిణీ కార్తె ముచ్చట్లు

మేరా భారత్ మహాన్!!!

5 comments:

  1. ఉపాయం ఉన్నవాడికి అపాయం లేదు 😀.

    ReplyDelete
  2. విన్నకోట నరసింహా రావుగరు,

    ఉన్నమాటన్నారు.
    మాకే ఉపాయం దొరకలేదండి. వేడి నలభై దాటి నాలుగౌ ఐదు ఆరు అలా పెరిగిపోతోంది. కరంట్ ఉన్నదా? ఆహా ఉన్నది కాని ఏ.సి పని చెయ్యదు ఉదయం తొమ్మిది మొదలు సాయంత్రం ఆరు దాకా! కారణం లో వోల్టేజి 160-180 మధ్య ఉంటుంది. ఎవరితో చెప్పుకున్నా ఉపయోగంలేదు, అంతటా ఇంతేనండీ అన్నదే సమాధానం.ఫేన్ ఏడుస్తూ తిరుగుతుంది. సాయంత్రం నుంచి ఏ.సి బాగా పని చేస్తుంది.

    ఇరవైనాలుగు గంటలూకరంటు, ఇదీ మాట. మెసేజ్ లకి మాత్రం లోటు లేదు. చినుకు పడే దాకా....

    ReplyDelete
  3. మాటతీరు గురించి:-
    -----------------------
    ఈ క్రింది లింక్ లోని శ్లోకం వినండి. ఒకప్పుడు బాగా పాప్యులర్ ట్యూన్ తో కూడిన శ్లోకం. దాదాపు ప్రతిరోజూ చెవులబడేది. (1). ఎక్కడ / ఏ మాధ్యమంలోవినబడేది? (2). ఏ సందర్భంగా వినబడుతుండేది?

    బ్లాగర్లు, బ్లాగ్ రీడర్లు .... అందరూ చెప్పచ్చు.


    కేయూరాణి న భూషయంతి పురుషమ్ (సంస్కృత శ్లోకం)

    "కేయూరాణి" శ్లోకానికి అర్థం

    "కేయూరాణి" సంస్కృత శ్లోకానికి అర్థం

    ReplyDelete
  4. విన్నకోట నరసింహా రావు గారు,

    ఇది భర్తృహరి శ్లోకం.

    మానవులకి శరీరం మీద పెట్టుకునేవి ఏవీ శోభని ఇవ్వవు,మంచి అర్ధవంతమైన మంచి మాటే మానవులకు నిజమైన అలంకారమన్నది అర్ధం.

    ఈ విషయం మీద చాలా టపాలే ఉన్నాయి, మరోటి మొదలెట్టే పని లేదు.

    ఇది ఎక్కడ? ఎప్పుడు? ఎలా?

    ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఉదయం ౭.౪౫ నిమిషాలకి శ్రీ కేశవపంతుల నరసింహ శాస్త్రి గారు పిల్లలకి పాట నేర్పేవారు. ఆ పాటకి ముందుగా ఇది ప్రార్ధన శ్లోకం గా చెప్పేవారు. చాలామందికిది కంఠోపాఠమే.

    ”ఇక చాలు ఇళ్ళకు వెళ్ళిపోదామా”... ఇదో పాట ..దీని వివరాలు చెప్పుడీ!



    ReplyDelete
    Replies
    1. మీకు తెలియనిదా? అసలు పైన నే పెట్టిన కామెంట్లో "బ్లాగర్లు, బ్లాగ్ రీడర్లు" అన్న దగ్గర శర్మ గారు తక్క ... అని కండిషన్ పెట్టుండవలసింది, మర్చిపోయాను 😀😀.

      "ఇక చాలు ఇళ్ళకు పోదామా" అనే పాట ఆలిండియా రేడియో వారి "బాలానందం" కార్యక్రమం చివర్లో వచ్చేది కదూ. రేడియో "అన్నయ్య" (న్యాయపతి రాఘవరావు గారు), రేడియో "అక్కయ్య" (న్యాయపతి కామేశ్వరి గారు) ఎంతో ఉత్సాహవంతంగా ఏళ్ళ తరబడి నిర్వహించిన కార్యక్రమం 🙏. పాల్గొనడానికి ఎప్పుడూ వెళ్ళలేదు గానీ నాక్కూడా "బాలానందం" మెంబర్-షిప్ కార్డ్ / సర్టిఫికేట్ ఉండేది. మా తండ్రిగారు ఒక రూపాయి దాని రుసుముగా M.O. పంపిస్తే రేడియో వారు ఆ కార్డ్ పోస్ట్ లో పంపించారు.

      Delete