Sunday, 19 May 2019

ప్రపంచం మారిపోతోంది-నీటితో నడిచే హైడ్రోజన్ ఇంజన్.




అరవై ఏళ్ళ కితం మాట, ఉద్యోగంలో చేరిన కొత్త.   కారు కొనుక్కోవాలనిపించింది. ఆ రోజుల్లో అంబాసిడర్ కార్ ఖరీదు పదివేలు! నా జీతం వంద రూపాయలు!!

జీతం పట్టుకెళ్ళి అమ్మకిస్తూ అడిగాను

”ఎప్పటికైనా కారు కొనుక్కోగలనంటావా అమ్మా!” అని.

విన్న అమ్మ ''నీటితో నడిచే కార్లొచ్చే రోజులొస్తాయి అప్పుడు కొనుక్కుందువు”  అన్నది.

నిజమే డిస్టిలెడ్ వాటర్ పోస్తే దానిని హైడ్రోజన్ ఆక్సిజన్ లుగా విడదీసి, హైడ్రోజన్ తో ఇంజను నడిపి ఆక్సిజన్ విడుదల చేసే ఇంజను కనుక్కోబడింది. జపాన్ లో విడుదల జేయబడుతోంది, తొందరలో. ఇంతకి కనుక్కునదెవరో తెలుసా? ఒక భారతీయుడు.


మరి జపాన్ లో ఎందుకు విడుదలజేయబడుతోంది. ఇటువంటి ఇంజన్ తయారు చేస్తున్నాను, సాయం చేయమని మన దేశ ప్రభుత్వాలని పదేళ్ళు అడిగి అడిగి నోరు నొప్పి పుట్టి జపాన్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. తొందరలోనే భారత దేశంలో కూడా విడుదల చెయ్యాలని అనుకుంటున్నట్టు చెప్పేడు. అనుమానమా! ఈ కింద లింక్ లో చూసెయ్యండి. 


https://www.ndtv.com/tamil-nadu-news/tamil-nadu-engineer-invents-engine-that-uses-hydrogen-releases-oxygen-2036119?pfrom=home-topstories


ప్రపంచ ముఖచిత్రం మారిపోతోంది. oil రాజకీయాలకి చెల్లు చీటీ రాసినట్టే.ప్రపంచ రాజకీయమే మారిపోతోంది. బహుపరాక్. ఆయిల్ కంపెనీల షేర్లు ఢమాల్, బహుపరాక్ 
మరో మాట.


ఈ కుర్రాణ్ణి చూశారా? 

Harshwardhan Zala

ఏం? ఏఅమ్మాయికైనా లైనేసేడా? కాదు కాదు.ఇంకా మీసం కూడా మొలవని మొనగాడు.

 ప్రపంచాన్ని మహమ్మారిలా పట్టి పీడిస్తున్న మైన్ (మందు పాతర)ల మూలంగా ఎంతో మంది చనిపోతున్నారు, police and military personnel. ఈ కుర్రాడో డ్రోన్ కనిపెట్టేడు. అది ఎక్కడ ఏమూల మందుపాతరున్నా కనిపెట్టేసి పనికి రాకుండా చేసేస్తుంది. ఎన్నో దేశాలు ఈ డ్రోన్ కోసం పోటీ పడ్డాయి. ఇవ్వనుగాక ఇవ్వనని దేశం లో వినియోస్తున్నాడు. Now Indian forces are free from the death of personnel due to land mine explosion.


ఇటువంటి వారిని మనం పట్టించుకుంటామా? ఉహు!

మేరా భారత్ మహాన్


9 comments:

  1. మీడియా వాళ్ల అతి వల్ల ఇలాంటి వార్తలు వస్తాయి. ప్రతిదానికి ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవటం సరికాదు. అంత మంచి డిజైన్లు ఉంటే కంపెనీలు వదులుకోవు. మీరు ఉద్యోగం చేరగానే కారు గుఱించి ఆడిగారంటే నమ్మబుల్ గా లేదు.

    ReplyDelete
  2. బుచికి
    సత్య నిష్ఠ కలిగిన ఎన్.డి.టి.వి వారు ప్రచురించిన వార్త కదా అని నమ్మేసాను. నిజం కాదంటారా! అయ్యో!!! ప్రభుత్వం మీద మీకున్న అభిమానానికి వందనాలు, నేను ఆడిపోసుకో లేదు, ఆ మీడియావారిదే ఆ పాపం!!!

    ReplyDelete
  3. శర్మగారు తాగే నీళ్ళకి కరువు రాబోతున్నదని , నీళ్ల కోసం యుద్దాలు జరుగుతాయని బెమ్మం గారు జెప్పినది నిజాలు కాబోతున్నాయి అన్నమాట. నీళ్లఏ కదా అని జులాయి వెధవలు మరింత గాలికి తిరిగే ప్రమాదం కూడా ఉంది మరి.

    ReplyDelete
    Replies
    1. astrojoyd
      బెమ్మంగారి మాట నిజమేనండి :)
      ఇప్పటికే పానీ పట్ యుద్ధాలు జరుగుతున్నాయి, తాగు నీటికి,సాగు నీటికి. ఇదేగనక నిజమైతే ఇప్పుడు డిస్టిల్లెడ్ వాటర్ లీటర్ పదిహేను దగ్గరగా ఉన్నది కాస్తా టాక్సులు వగైరాలతో కలుపుకుని నలభై ఐదుకి చేరదూ?

      జులాయిగా తిరిగేవాళ్ళకి పెట్రోల్ రేటు తో లెక్కుండదనుకుంటానండి.

      Delete
    2. జులాయిగా తిరిగేవాళ్ళు సాధారణంగా తమ స్వంత డబ్బులతో పెట్రోలు పోయించుకోరండి. అందువల్ల రేటుతో వాళ్ళకి లెక్కుండదు. 🙂

      Delete
    3. విన్నకోట నరసింహా రావు
      జులాయిగాళ్ళకి కారూ స్వంతం కాదు పెట్రోలూ స్వంతం కాదు. తిరుగుడు మాత్రం వాళ్ళదేనండి. అన్నీ ముఫ్ఫత్తే!

      Delete
  4. నీటితో నడిస్తే నీటి ఇంజనో వాటర్ ఇంజనో అవుతుందిగాని హైడ్రోజన్ ఇంజిన్ ఎలా అవుతుంది మాస్టారూ. కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు.
    జపాన్ వారికి చమురు దూరప్రాంతం నుంచి తెచ్చుకోవాలి కాబట్టి ఖర్చు ఎక్కువ. మనకి గల్ఫ్ పక్కనే కదా. పైగా నీటినుంచి హైడ్రోజన్ తీయడానికి కూడా శక్తి అవసరం. ఆ పైన ఇంజిన్ తయారీకి ఖర్చు ఎంతో తెలియదు. ఏదేమైనా మనవారికి దూర దృష్టి తక్కువ. స్వల్పకాలిక లాభాలకోసమే చూస్తారు కనుక పరిశోధనలను ప్రోత్సహించరు.

    ReplyDelete
    Replies
    1. సూర్య
      వార్త నాకు అర్ధమైన ప్రకారం, ఇంజన్ లో పోసేవి డిస్టిలెడ్ వాటర్. ఇది హైడ్రోజన్ ఆక్సిజన్ మూలకాలుగా విభజింపబడి, హైడ్రోజన్ తో ఇంజన్ నడిచి, ఆక్సిజన్ విడుదల చేయబడుతుందండి. దీన్ని మీరు నీటి ఇంజన్ అంటారో, హైడ్రోజన్ ఇంజన్ అంటారో మీ ఇష్టం.

      ఇలా ఆక్సిజన్ విడుదల జేయబడితే మరే ప్రమాదాలొస్తాయో తెలీదు. ఇప్పుడు మనం పీల్చేగాలిలో నైట్రో జన్ ఎక్కువ, ఆక్సిజన్ తక్కువనుకుంటా. ఇదిగనక జరిగి ఎక్కడికక్కడ ఆక్సిజన్ ఎక్కువగా విడుదల జేయబడితే కొత్త రోగాలొస్తాయేమో! పర్యావరణ సమతుల్యం దెబ్బతినదా!

      మూలకాలుగా విడదీయడానికి శక్తి కావాలి కదా! అదెలా సమకూరుతుందో తెలీదు. పరిశోధనలకి ఖర్చు పెట్టడం అలవాటు తక్కువ మనకి. అంతెందుకు విద్య మీద పెట్టుబడి నష్టమని విద్యను ప్రైవేట్ పరం చేసిన ఘనత మనదే!

      Delete
  5. https://scontent.fhyd2-1.fna.fbcdn.net/v/t1.0-9/60796935_2406679149394861_2846889256490631168_n.jpg?_nc_cat=108&_nc_ht=scontent.fhyd2-1.fna&oh=34bbf07d89162bb9b91968dd58f7739c&oe=5D50E86C

    ReplyDelete