Tuesday, 11 December 2018

గుదిబండ






గుదిబండ

8 comments:

  1. పాపం, శ్రీనాథుడంతటి వాడికి కూడా పడింది గుదిబండ 🙁.
    ఇలా పశువులకి గుదిబండ వెయ్యడం ఎప్పటి నుండో ఉన్నదే అనుకోండి, కానీ ఈ కాలంలో జీవకారుణ్య సమాజం వారు ఊరుకుంటున్నారా 🤔?

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావు గారు

      ‘‘ కవిరాజు కంఠంబు కౌగలించెనుగదా
      పురవీధినెదురెండ పొగడదండ
      సార్వభౌముని భుజ స్తంభమెక్కెను గదా
      నగర వాకిట నుండ నల్లగుండు
      ఆంధ్ర నైషధకర్త మంష్రియుగ్మమ్మున
      దగరి యుండెనుగదా నిగళయుగము
      వీరభద్రారెడ్డి విద్వాంసుముంజాత
      వియ్యమందెను గదా వెదురుగొడియ
      కృష్ణవేణమ్మ గొనిపోయెనింత ఫలము
      బిలబిలాక్షులు దినిపోయె తిలలు పెసలు
      బొడ్డుపల్లెను గొడ్డారిమోసపోతి
      ఎట్లు చెల్లింతు టంకంబు లేడునూర్లు
      దివజ కవివరు గుండియల్ దిగ్గురనగ
      నరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి’’
      Courtesy: http://www.thetageethi.org/s57.html


      గేదెలు తప్పించి ఆవులు,ఎద్దులు కనపడటమే లేదండి పల్లెలలో కూడా

      Delete
    2. మిత్రులు శర్మగారు,
      నిజానికి ఈ పద్యాన్ని ఈ ఉదయమే ఎందుకో మననం చేసుకున్నాను. ఈరోజు ఎక్కడో కనిపిస్తుందేమో అనిపించిందో లేదో ప్రత్యక్షం ఐనది! పాపం కవిత్వవ్యవసాయం మాత్రమే తెలిసిన శ్రీనాథకవి బొడ్డుపల్లిని గొడ్డేరి (కౌలుకు తీసుకొనొ) మోసపోయాడు కదా! అన్నట్లు, చివరి రెండు పాదాలు వేరే పద్యం లోనివి.

      Delete
    3. శ్యామలీయం గారు
      శ్రీనాథుని చాటువులు రెండు సీస పద్యాలు గుర్తునుంచి పోయాయండి. మొదటి మాట కవిరాజు కంఠంబు కౌగలించెనుగదా పురవీధి నెదురెండ బొగడదండ ఇది గుర్తుంది. దానితో వెదికితే తేటగీతివారి పద్యం దొరికింది. క్రెడిట్ ఇచ్చేస్తూ ప్రచురించేశా. తరవాత చూస్తే పొరబాట్లు కనపడ్డాయి. ఏంచేయాలనుకుని, ఎవరేనా సరి చేయకపోతారా అనుకున్నా. అదృష్టం మీరే దొరికారు. ఈ రెండు పద్యాలూ కొంచం ఇక్కడ వేయాల్సిందిగా కోర్తాను. శ్రమిచ్చేశాను ఏమనుకోవద్దు.
      ధన్యవాదాలు.

      Delete
    4. శర్మ గారు
      ఈమాట వెబ్ మాగజైన్ వ్యాసం శ్రీనాధుని చాటుపద్యములు తిలకించండి. లింక్ http://eemaata.com/em/appendix/1356.html

      Delete
    5. శ్యామలీయంగారు
      ధన్యవాదాలు.
      కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా
      పురవీథి నెదురెండ పొగడదండ
      యాంధ్రనైషథకర్త యంఘ్రి యుగ్మంబున
      దగిలియుండెను గదా నిగళయుగము
      వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత
      వియ్యమందెను గదా వెదురుగొడియ
      సార్వభౌముని భుజాస్తంభ మెక్కెను గదా
      నగరి వాకిట నుండు నల్లగుండు

      కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము
      బిలబిలాక్షులు తినిపోయె దిలలు బెసలు
      బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
      నెట్లు చెల్లింతు సుంకంబు లేడు నూర్లు (7)

      కాశికా విశ్వేశు గలిసె వీరారెడ్డి
      రత్నాంబరంబు లే రాయడిచ్చు
      రంభ గూడె దెనుంగు రాయ రాహుత్తుండు
      కస్తూరి కే రాజు ప్రస్తుతింతు
      స్వర్గస్థుడయ్యె విస్సన మంత్రి మరి హేమ
      పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు
      కైలాసగిరి బండె మైలార విభుడేగె
      దినవెచ్చ మే రాజు దీర్పగలడు

      భాస్కరుడు మున్నె దేవుని పాలి కరిగె
      గలియుగంబున నికనుండ కష్టమనుచు
      దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
      నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి
      Courtesy:http://eemaata.com/em/appendix/1356.html

      Delete
  2. సారస్వతం అనే ఒక మంచి బ్లాగు ఉంది లింక్ http://saraswatam.blogspot.com/

    ఆసక్తి కలవారు పరిశీలించండి

    ReplyDelete