25, జనవరి 2018, గురువారం

రథ సప్తమి





12 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. nagarani yerra
      ప్రత్యక్ష దైవానికి నమస్కారం
      అమ్మాయ్! చాలా రోజుల తరవాత కనపడ్డారు. కుశలమా?
      ధన్యవాదాలు

      తొలగించండి


  2. ఇదిగిదిగో రథ సప్తమి
    సదనంబందున సచిత్ర జావాహిరులున్
    పదిలమ్ముగాను పెట్టిరి
    వదనమ్ము సయి వికసింప వందన మిడుమా !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Zilebiగారు,

      ’సయి’
      పడికట్టురాళ్ళు :) బెందడి తప్పటం లేదు!
      ధన్యవాదాలు

      తొలగించండి


    2. పడికట్టు రాళ్ల గూర్చుచు
      పిడివాదమ్ముగ పదముల పిండు జిలేబీ
      గడినుడి కాదే పద్యము
      పిడిబాకై హృదయము నులివెట్టవలెనకో !

      జిలేబి

      తొలగించండి
    3. Zilebi

      ''పిడిబాకై హృదయము నులివెట్టవలెనకో !''
      ఏం చెప్పేరు :)
      బెందడి ఇటుకలు సరిపోతే చాలదు,తూకమేదీ?
      ధన్యవాదాలు.

      తొలగించండి


    4. బెందడి యిటుకలు చాలదు
      సందడి పదముల జిలేబి చాలదు సుమ్మీ !
      విందారగింపు తూకపు
      చందము గావలయునమ్మ చక్కగ నిలువన్ :)

      జిలేబి

      తొలగించండి
    5. Zilebi
      బెందడి యిటుకలు చాలదు
      కాదు, ”బెందడి ఇటుకలె చాలవు” అనాలి,
      నేను వస్తాడు అనరు :)
      Grade C1

      తొలగించండి
  3. గురువు గారు, కుంపటి, ఇత్తడి పాత్ర వాడేవాళ్లు ఇంకా ఉన్నారన్న మాట. మీఫొటోలన్నీ బావున్నాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. anyagaami గారు,

      కొత్త పిడతలో ఆవు పిడకల దాలి మీద పరమాన్నం వండే రోజులు పోయాయి,కొత్త బియ్యం,కొత్తబెల్లంఆలోచనే లేదు. ఇప్పటికి కుంపటి, ఇత్తడి పాత్రకి మిగిలాం. చెఱుకు కర్రతో పాయసం కలియబెట్టే రోజులూ పోయాయి. జిల్లేడూ ఆకులు,రేగిపళ్ళు దొరికాయి గాని, చిక్కుడాకులు దొరకలేదీ సంవత్సరం.

      అసలు సూర్యుడిని చూడనివాళ్ళకంటే మేలనుకుని సరిపెట్టుకున్నాం.
      ఫోటో లు నచ్చినందుకు
      ధన్యవాదాలు

      తొలగించండి