Wednesday, 17 January 2018

మా ఊళ్ళో తీర్థం

అమ్మలగన్నయమ్మ
కనుమనాటి అమ్మవారి నైవేద్యం


 కూరగాయలు కాదు మట్టి బొమ్మలు
ప్లాస్టిక్ పువ్వులు


వంటింటి ఉపకరణాలు










కప్పులు సాసర్లు ప్లేట్లు మంచివే వచ్చాయి అమ్మకానికి



ఈ సారి తీర్థంలో ఎక్కువగా బొమ్మల కొట్లే కనపడ్డాయి


 సోలార్ దీపాలు తీర్థానికే దిగొచ్చాయి. ఒక్కోదాని ఖరీదు మూడు వందలు. చిన్న సోలర్ చార్జర్ పైన ఒక ఎల్.ఇ.డి 5వాట్ లేంప్, ఒక cell చార్జర్ పాయింట్. పెద్దగా అమ్ముడైనట్టు లేదు. మనదేశం కంపెనీదే వస్తువు. రాజపుట్ అండ్ కో


ఇవి చైనా బొమ్మలు కావచ్చు


 ఒక సాహెబ్ గారి సెంట్ల దుకాణం. మొత్తం లో నాలుగైదు దుకాణాలు కనపడ్డాయి. ఇదివరకెపుడూ ఈ ఒక్కటే కనపడేది.
Cattle pult  పంగల కర్ర

చెప్పుల దుకాణాలూ బాగానే కనిపించాయి.


 luggage bags

Ladies purses

Game

ముగ్గులు వేసుకునేందుకు చక్రాలు, బలే బలే డిజైన్లు. ఒక్కోటి ఇరవి రూపాయలన్నాడు. రెండిమ్మన్నా! తీరా చూస్తే జేబులో డబ్బులు లేవు,అయ్యో! జేబులో వేసుకొచ్చిన డబ్బులు సెల్ ఫోన్ తీసేటపుడు పడిపోయాయనుకున్నా! ఇంటికొచ్చాకా చెప్పేను డబ్బులు పడిపోయాయని. ఇంట్లోనే పడిపోయాయి చూసుకోకుండా వెళ్ళేరన్నారు. ఇంటి దగ్గరే పడిపోయాయి.

ఇదెప్పుడూ చూడలేదు తీర్థంలో మొదటి సారి.



 మిరపకాయ బజ్జీలు.నోరూరిస్తున్నాయి. డబ్బులూ లేవు,పళ్ళూ లేవు. :)


దిష్టి బొమ్మలు.

ఈ సంవత్సరం తీర్థం కొంచం కళ తప్పినట్టనిపించింది, ఏంటబ్బా అని పరికిస్తే ఏల్.ఇ.డి దీపాలు :) కరంట్ ఖర్చు చాలా తగ్గి ఉంటుంది. 

సరదాగా తీసిన వీడియో సరిగా రాలేదు

28 comments:



  1. తిరణా లొచ్చెను వూరి లోన రమణీ తీర్థంబు లాడానహో :)
    సరదాగా నడిచాను తీర్థమున తీసానోయి ఫోటోల నె
    ల్ల రసాస్వాదన గాంచి వూరి నడుమన్ లావణ్య మొప్పారగన్
    మరి పాకెట్టున డబ్బు బోవ తిరిగా మాయింటి దారిన్గనీ !

    ReplyDelete
    Replies
    1. తీర్థమాడి రనగ తేడాగ యనిపించు
      తీర్థమేగి రనుట తీరుగుండు
      తెలియ బుధుల పలుకు తేడాల మయమయ్యె
      పెద్దల బడి చదువు చోద్దె మేమొ !

      Delete
    2. Zilebi, వెంకట రాజారావు . లక్కాకులగారు,
      అమ్మవారు నిఘంటువు చూసుకుంటూ పజ్జాలు రాస్తారు! పండితౌలు కదా! అవి వారికే అర్ధం కావు, మనకెలా ఔతాయండి :)
      ధన్యవాదాలు.

      Delete


    3. నిఘంటువును జూచుచు గజనీమహమ్మదై
      జగమ్ము నట తాకెనుగద జాణ పూవుబో
      డి! గట్టి దరువల్ గనుచు పెడేల్మనంగ ని
      మ్మ గయ్యిమని డిండిమనిట మాచనార్యకున్ :)

      జిలేబి

      Delete
  2. ఎవ్వార లీవిశ్వ మెంతేని నేర్పుతో
    కడు మనోఙ్ఞముగ నేర్పడగ జేసె
    ఎవ్వార లీసృష్టి కేడు గడయై నిల్చి
    కాచి రక్షించునో కనుల నిండ
    ఎవ్వార లీప్రాణు లే సంకటము లేక
    చరియించ పాప సంహరణ చేయు
    ఎవ్వార లీ ప్రజ కెంతేని విఙ్ఞాన
    జ్యోతుల నందించి యునికి నేర్పు

    ఆమె లలితా పరంజ్యోతి ఆమె దుర్గ
    ఆమె శారద ఆమెయే ఆదిలక్ష్మి
    అంతటను నిండి తనయందె అంత నిండి
    వెలుగు మూలపు టమ్మకు వేల నతులు .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకులగారు,
      పద్యం కాలం తో పాటు ప్రజల నాలుకల మీద నిలబడిపోవాలి, అదికదా!
      ఒక అమృత రసగుళిక
      _/\_
      ధన్యవాదాలు.

      Delete

  3. కనుమ నాడు కోనసీమలో "జగ్గన్న తోట (ప్రభల) తీర్ధం" జరుగుతుంది కదా, అలాగే కనుమ రోజున మీ ఊళ్ళో అమ్మవారి తీర్ధం జరుగుతుందాండి?

    ఫొటోలు బాగున్నాయి. పాతరోజుల్ని గుర్తు చేసాయి. catapult (పంగలకర్ర) చూసి చాలా కాలమయిపోయింది. అవునూ, తీర్ధాల్లో "మంచం మిఠాయి" 😛 పెట్టడం మానేశారా ఏమిటి శర్మ గారూ, ఫొటో కనపడలేదు?

    ఏమైనప్పటికీ సోకాల్డ్ ఆధునికతకు బలవ్వకుండా తీర్ధాల్లాంటి ఉత్సవాలు ఇంకా జరుగుతుండడం సంతోషం.

    మరొక పెద్ద తీర్ధం "సుబ్బారాయుడి షష్టి తీర్ధం" కదా, మీ ఊళ్ళో జరుపుతారా (అమలాపురంలో చాలా ఘనంగా జరిగేది)? ఆనవాయితీ గనక వుంటే ఈసారి మీ ఊళ్ళో జరిగినప్పుడు (నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో అనుకోండి, ఇంకా చాలా టైముంది) దాన్ని గురించి ఫొటోలతో సహా పోస్ట్ పెడితే బాగుంటుంది.

    ReplyDelete
    Replies


    1. మంచుమిఠాయీ చిత్రము
      కొంచెము కూడ కనరాలె! గురువా! యేలన్
      సంచయమందు జిలేబీ
      లించుక లైన కనరాలె లీడంబయెనో ?

      జిలేబి

      Delete
    2. "మంచు" మిఠాయి కాదండి, "మంచం" మిఠాయి. తిరణాలల్లోను (తూర్పు గోదావరి జిల్లాలో తీర్ధం అంటారు), సంతల్లోను అమ్మేవారు.

      Delete
    3. విన్నకోట నరసింహా రావుగారు,

      మా ఊళ్ళో మూడు రోజులు తీర్థమండి. మొదటి రోజు మందుగుండు కాల్పు పోటీ, రెండవరోజు జాతర, మూడవరోజు, నాల్గవరోజు పశువుల పండగ, వైభవంగా ఉంటుంది.

      పంగల కర్రలు వస్తూనే ఉంటాయండి, తీర్థానికి. మంచం మిఠాయి, పంచదార చిలకలు మంచాలేసి పెట్టి అమ్మేవారు, ఆరోగ్య శాఖ వారి గోలతో మానేశారండి. పచ్చి మిర్చి బజ్జీ వగైరాల కొట్లు, నిప్పుండేవాటిని వేరు చేశారు,కొద్ది దూరంగా. గోల్గప్పా బళ్ళు రెండే కనపడ్డాయంది. జీళ్ళు, ఖర్జూరం కొట్లు రెండే వచ్చాయి. ఆధునికులు పేకెట్లలో విషమమ్మినా మాటాడరు, విడిగా అమ్మితే మాత్రం ఇలా అరుస్తుంటారండి.

      మా ఊళ్ళో వీర్రాజు మామిడి అని అక్కడ షష్టి సంబరం జరుగుతుంది, కాలవ దాటి వెళ్ళాలి. ఒక సారి ఫోటో లు పెట్టిన గుర్తు :) మాకు దగ్గరలో బిక్కవోలు లో షష్టి తీర్ధం ప్రసిద్ధి, అందుకు మేమంతా అక్కడికే పోతాం! బిక్కవోలు లో స్వామి గుడి బహు ప్రాచీనం, చూడవలసినదే, పక్కనే గొల్లల మామిడాడ కోదండరామస్వామి ఆలయం, అక్కడే సూర్య దేవాలయం.
      ధన్యవాదాలు.

      Delete
  4. dear sir very good blog and very good telugu message
    Latest Telugu News

    ReplyDelete
  5. గురువుగారూ ఫోటో-జర్నలిజం అద్భుతః. ఆ కూరగాయలు బొమ్మలంటే నమ్మలేకపోయాను.

    ReplyDelete
    Replies
    1. YVR's అం'తరంగం'గారు,

      ఒనిడా చిన్న ఆండ్రాయిడ్ తో తీసిన ఫోటో లు,సరదాగా :) కూరగాయలని లా మట్టితో తయారు చేసి రంగులేస్తారు, ఆడపిల్ల అత్తవారింటికెళ్ళేటపుడు సారిలో వీటిని పెట్టడమూ ఆచారం,అదో సరదా! నిజమైనవాటి లాగే ఉంటాయి, అదాటుగా చూస్తే.
      ధన్యవాదాలు.

      Delete
  6. ఫొటోలు బాగున్నాయి సార్. జిలేబి గొబ్బెమ్మాళి బుచికి పద్యాలు చదివి జీవితేచ్ఛ నశించిపోయే.

    ReplyDelete
    Replies
    1. జిలేబి కి బుచికి పజ్జాలు అలవాటైపోయాయి. వీటికి పేరు పెట్టేరుట, కొద్దిగా అర్ధమయ్యే వాటిని 'పైకూ' లంటారట. అర్ధం కాని వాటిని 'పికూ' లంటారట. జిలేబి గురించి ఆలోచించి బుర్ర పాడుచేసుకోకండి!
      ధన్యవాదాలు.

      Delete


    2. పైకూలు పికూలూ ప
      ద్యా గరిమలనన్ జిలేబి దరువుల్ బుచికీ
      లాగరిని తాకె డిమడిమ
      లై కాల్చెనటన్ మరియొక లాఠీ వేయీ :)

      జిలేబి

      Delete
    3. పండితుల దురద లెందుకు ,
      నిండుగ ననుదినము మనము నేర్చి వచించే
      దండి తెలుగు పలుకు బడులు
      మెండుగ వాడండి సొబగు మీరును పద్యాల్ .

      Delete
    4. పండితుల దురద లెందుకు ,
      నిండుగ ననుదినము మనము నేర్చి వచించే
      దండి తెలుగు పలుకు బడులు
      మెండుగ వాడండి సొబగు మీరును పద్యాల్ .

      Delete
    5. Zilebi
      మాకేల మీతో గోల?
      తమ చిత్తం తమది

      Delete
    6. వెంకట రాజారావు . లక్కాకులగారు,
      మంచి మాట చెబితిరి

      Delete


    7. మా కేలనో గదా మీ
      తో గోల జిలేబి బామ్మ, తొలగన్ తొలగన్ !
      వాగుడు కాయల బాదుడు
      మాకేలన్ బో బిలేజి మాకేలన్ బో :)



      లక్కాకులయ్య ! చెబితిరి
      చక్కటి మంచి పలుకు ! మన జాణ జిలేబీ
      చక్కిలములవేల మనకు !
      రక్కసి మనమాట వినున రాజా విడువన్ !

      జిలేబి

      Delete
    8. రవి కిరణంబు మాడ్కి , తనరన్ , రచనల్ వెలయించి , లోక బాం
      ధవుడయి వెల్గువాడు , ఘనతన్ విడనాడి , తథేక దృష్టి , కం
      దువ గత క్రీడలో బడెను , దోగి , సమస్యల పూరణార్థ , మీ
      కవి - తలలేని భావములు కైతల కెక్కె ప్రశంసనీయమై .

      Delete
    9. వెంకట రాజారావు . లక్కాకులగారు,
      పద్యం బాగుందండి.
      ధన్యవాదాలు.

      Delete
  7. తీర్థంలో మీరు తీసిన బొమ్మల-బొమ్మలు భలే భలే! అసలే బొమ్మలు నాకిష్టమేమో మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తున్నాను - కుదిరినప్పుడల్లా!

    ReplyDelete
    Replies


    1. మా యిష్టంబయ్యా ఓ
      మా యయ్యా !బొమ్మలనగ మా యిష్టంబ
      య్యా!యెన్నిమారు లిటనే
      నాయాసపు రొప్పుల నమనంబందునయా :)

      జిలేబి

      Delete