18, జూన్ 2026, గురువారం

చినుకు భాగోతం

 చినుకు భాగోతం


చిందు భాగవతం కాదు సుమా! ఇది చినుకు భాగోతమే! జూన్ నెల సగం గడిచినా చినుకు కనపడలేదు,మా దగ్గర. మా వాట్సాప్ గ్రూప్లో దీనిమీద మహాపుణ్యాత్ములున్నచోట చినుకు పడుతుందయ్యా! వగైరా,వగైరా చెణుకులు నడుస్తున్నాయి. 


బుధవారం మధ్యాహ్నం భోజనం తరవాత పడకేసాను ఒంటిగంటకి.  రెండు గంటలకి టక్కున లేవడం రోజూ అలవాటు. కాని మూడుదాకా మెలకువరాలేదు, ఇంత సేపు నిద్రా అనుకున్నాగాని,ఇది రాబోయే కష్టానికి సూచన అనుకోలా! . మెలకువొచ్చేకా అల్పాచమానానికి బయట పాయఖానాకి వెళ్ళాను. వేడి,ఎండ తోడు వడగాలి చుర్రు మనిపించాయి. వెళ్ళిన పని పూర్తిచేసుకుని రయమున లోపలకొచ్చిపడ్డా! మరో పావుగంటలో కోడలమ్మాయి,మబ్బేసింది, గాలిచల్లబడింది వార్త చెప్పింది,గాలేస్తోందని కూడా చెప్పింది. ఇంకేం అనుకుంటూ లేవబోయే లోగా కరంటు పోయింది. బయటి కొస్తే గాలి వేస్తోంది,చల్లగా ఉందిగాలి. అరే! ఇప్పటిదాకా ఉన్న వేడి ఏమయిందబ్బా అనుకునే లోగా చినుకులు ప్రారంభమయ్యాయి. ఎలా? మొన్న తమ అల్లుడు జిలేబీని ఆశీర్వదిస్తూ శ్యామలీయంగారు చల్లిన స్వాతి చినుకుల్లా! గాలి ఆగిపోయింది, ఇక చూడురాజా! మా బతుకు! కుమ్ములో పెట్టిన చిలకడ దుంప చందమైపోయింది. లోపల వేడి బయట కాంక్రీట్ జంగిల్ మీద పడ్డ చినుకులకి లోపనుంచి,భూమి నుంచి వేడి తన్నుకొచ్చింది. ఇంకేం చెప్పీది?చినుకు భగోతం? ఇది ఒక అరగంట సాగింది. వేడి తగ్గలేదు. కరంటు రాలేదు. షరా మామూలుగానే రాత్రి 8.30 కి వచ్చింది,మళ్ళీ పోయినా వచ్చేసి స్థిరంగా ఉంది, అదొక్కటే సంతోషం.


ఈ సందర్భంగా కొన్ని సంభాషణలు గుర్తొచ్చేయి. కితం ఎన్నికలరోజు ఎండలు మండుతున్నాయని ఒకాయనంటే మరొకరు బాబొస్తాడుగా, బాబొస్తే కరువొస్తుందని ఆ పార్టీవాళ్ళె అనుకుంటున్నారని చెప్పేడు,అది నిజమా? ఏమో!  కరువుకి ఆయన ఎన్నికకి సంబంధం ఏంటబ్బా !


నిన్నఒకరు నేరేడు పళ్ళు ఎక్కువ కాస్తే కరువొస్తుందని చెప్పేరు. అది నిజమే, నిరుడు నేరేడు పళ్ళు కేజి.400 నుంచి 600 అమ్మింది. నేడు 200 నుంచి 300 లో దొరుకుతున్నాయి. నేరేడు పళ్ళు ఎక్కువకాయడానికి కరువుకి లింకేంటండీ అంటే , నేరేడు చెట్టు రాబోయే కాలంలో నీరు లేక తనజాతి నశిస్తుందని ఎక్కువ బీజాలు ఎక్కువ ఉత్పత్తి చేస్తుందట. ఇది ప్రకౄతి సూత్రమన్నారు.నిజమా! మనవారి ప్రకౄతి పరిశీలన ఇంతా నిశితంగా ఉండేదా! 


వారంకితం శ్యామలీయంగారితో మాటలో చినుకులేదనివాపోతే మాకు వర్షం పడుతోందండీ, మీకూ పడుతుందని ఆశీర్వదించారు. మొన్న శోధిని శ్రీనవాస్ గారితో మాటలో ఇలా వాపోతే మాకు వర్షం ఉందిగాని వేడి తగ్గలేదు,మీకూ వర్షం పడుతుందిలెండన్నారు. పుణ్యాత్ముల ఆశీర్వచన ఫలితం కావచ్చు నిన్నటి చినుకు భాగోతం. నేడు ఎండలేదు, వేడి,వడగాలి షరా మామూలే! ఇదండీ బాబూ,మా చినుకు గోల.      

15 కామెంట్‌లు:

  1. దీని కతాకమామీ షే మిటండి తాతగారూ ~?
    మొన్న తమ అల్లుడు జిలేబీని ఆశీర్వదిస్తూ శ్యామలీయంగారు చల్లిన స్వాతి చినుకుల్లా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి

      నీది ఏదుంతిన్నా ఎడబెట్టీనట్టు పందుంతిన్నా పరగడుపే లెక్క.అంతా కొత్తే నీకు. ఈ టపా చదువుకో కామెంట్లతో సహా!
      https://kasthephali.blogspot.com/2026/02/blog-post_26.html

      చెత్త బ్లాగులు చెత్త పోష్టులు చెత్త వ్యాఖ్యలు గుంపులే
      ఎత్తి పోతలు వింత భాషల చెత్త కైతలు పోగులే
      మొత్తుకోళ్ళులు నెత్తిపొడ్పులు సుత్తిమాటలు రాశులే
      వత్తురా యిక పాఠకుల్ మన బ్లాగులోకపు జోలికిన్

      సరిదా!

      తొలగించండి
  2. "అల్లుడు జిలేబీ" అంటున్నారు ..?

    బాబొస్తే కరువొస్తుందని అందరూ చెప్పేది విన్న విషయమే అయినా... నేరేడు పళ్ళు ఎక్కువ కాస్తే కరువొస్తుందన్న క్రొత్త విషయం తెలిపినందుకు సంతోషం..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాస్ జీ

      చాలా కాలం కితం మాట.చరిత్ర టూకీగా
      శ్యామలీయంగారు రెండు "జిలేబి శతాకల"కి కృతికర్త. జిలేబి కృతిభర్త. అలా జిలేబి శ్యామలీయంగారి అల్లుడు.

      ఇక నాకు జిలేబికి ఎప్పుడూ అష్టమ చంద్రుడు నైథన తార కదండీ.

      ఇక నేరేళ్ళు ఎక్కువకాస్తే కరువొస్తుందని ఒక వ్యవసాయదారుడు నా వయసువాడు చెప్పినమాట. ఇక్కడ సమయం సందర్భం కలిసొచ్చాయి గనక చెప్పేనండి. నేరేళ్ళు ఎక్కువకాసేయి,పల్లెలలో చినుకు రాలలేదు ఈ సమయానికిన్నీ,డాబుగా మబ్బుమాత్రం వేసింది, బాబు అధికారానికొచ్చారు, కరువు సూచనలు దండిగా కనపడుతున్నాయి. అన్నీ సరిపోతున్నట్టే ఉందండీ! అదీ సంగతి.

      తొలగించండి
    2. -

      "అష్టమ చంద్రుడు నైథన తార "

      ఈ సమాసమేమిటో బావుందండీ తాతగారు

      దీని మతలబేమిటో విశదీకరించుడీ


      తొలగించండి
    3. జిలేబిని అల్లుడు అంటున్నారు ... వారు మగవారా??? ఇప్పటిదాకా ఒక "బామ్మ" అనుకున్నానే

      తొలగించండి
    4. శ్రీనివాస్ జీ

      ఈ ప్రశ్న చాలా కాలంగానే బ్లాగుల్లో ఉన్నదండి.
      జిలేబిగా తెనుగుబ్లాగుల్లో ఉన్న ఈ జీవి,ఊరు,పేరు,మగ,ఆడ చెప్పుకోలేని జీవి. నేనైతే తృతీయ ప్రకృతిలో చేర్చుకున్నాను.

      అల్లుడనే సందర్భం గురించి.
      కృతిని కాలంగా కన్యగానే చెప్పుకొచ్చారు. కృతిని అంకితం తీసుకున్నవారు ఆడ,మగ ఎవరైనా కృతిభర్తగానే చెప్పారు.మగవారైతే కృతికర్తకు అల్లుని వరుసకు చేర్చేసేరు. ఈ ఒక్క విషయంలో తప్పలేదంతేనండి.

      తొలగించండి
  3. జిలేబుల చినుకు భాగోతం


    రచన
    శ్రీమాన్ కష్టేఫలి తాతగారు

    https://youtu.be/eAxvDpr6YCQ?si=LHYH1QHOqOzKHT8W


    ఎన్ జాయ్
    ఎల్లెమ్మ జిలేబీయము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చెప్పలేదని గోల పెడతావు,రాసే ఓపికలేదు, లింక్ లో చదువుకో.
      https://www.google.com/search?q=%E0%B0%85%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%AE+%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81+%E0%B0%A8%E0%B1%88%E0%B0%A5%E0%B0%A8+%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0&rlz=1C1JJTC_enIN1214&sourceid=chrome&ie=UTF-8

      తొలగించండి
  4. Fruiting in trees is a process based entirely on past and present weather conditions. it has no scientific connection to future droughts. According to plant science, any perennial tree requires a massive amount of energy to bear fruit. If it rained well the previous year, the tree's roots go deep into the soil to absorb moisture and nutrients. The Jamun tree uses this energy to store carbohydrates (food) within itself. This stored food is what drives abundant blooming and fruiting in the next season
    Therefore, a bumper crop is a sign of the previous year's prosperity, not an upcoming drought.The right advice is to follow science and enjoy this sweet gift of nature (the Jamuns).

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బోనగిరి సార్!
      మీరు చెప్పినమాట సైన్స్ చెబుతున్నది,కాదనలేను. కాని అనుభవం మీద మన పెద్దలు చెప్పినది,ఇది మన సమాజంలో ఉన్నది. మరికొన్ని చోట్ల కూడా ఈ విషయం ఈ మధ్యకాలంలో చదివాను.

      తొలగించండి
  5. సో మా మావగారు శ్యామలీయం గారని కన్ ఫర్మ్ చేసేసారాండీ తాతగారూ ?

    అయితే ఇక మాదే (రామ) రాజ్యం :)

    రిప్లయితొలగించండి
  6. తాతగారికి సాదర ప్రమాణములతో
    క్రొత్తగా నెలకొల్పిన మావ గారికి అర్పితము
    గా ఒక సరికొత్త కానుక సమర్పణ




    రిప్లయితొలగించండి