2, జూన్ 2026, మంగళవారం

నేను ఎవరు? (కో అస్మి )

 


25 కామెంట్‌లు:

  1. నాహం మనుష్యో నచరేవ యక్షః
    న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రః
    న బ్రహ్మచారీ న గృహీ వనస్థో
    భిక్షు ర్నచాహం నిజ బోధ రూపః

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం వారు
      నేనెవరు కాదో చెప్పేరు,అసలు నేనెవరనికదా ప్రశ్న.

      తొలగించండి
    2. శ్యామలీయంవారు,
      తనను తాను తెలుసుకోవడమా? వివరించ వేడుక.

      తొలగించండి
  2. -

    నారదా :)

    మెట్ట వేదాంతములవేల ? మేల్మిగాను
    బతుకు బండిని సాగించి‌ బాగు పడుడు





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి,
      ఒకప్పుడు నీ లేకిమాటలకి చిరాకు వచ్చేది,తరవాతకాలంలో కోపంవచ్చేది. నీ దయవల్ల ఆ రెండిటిని క్రమంగా తగ్గించుకోగలైగాననుకుంటున్నా. నీలో కొద్ది మారపుకూడా తెచ్చుకోకు ఇలాగే కొనసాగిపో!

      తొలగించండి
    2. -

      కోపము చిరాకు నీ దయ
      తో పోయె జిలేబి ! మారుతున్నవి తలపుల్
      నా పరిధి విస్తృతంబై
      నీ పద్ధతిలోన మార్పు నేగన లేదే!



      తొలగించండి
  3. రిప్లయిలు
    1. జిలేబి,
      బతుకు బండి గతుకులరోడ్డులోనే నడుస్తోంది. కనీసం నేటికైనా నేనెవరు అనే ఆలోచనైనా పుట్టకపోతే జీవితం వ్యర్థమేమో సుమా! జీతంలో ఒకవయసులో అసలీ ప్రశ్నలే లేవు,కొంతకాలంలో ఈ ప్రశ్నలున్నట్టు తెలిసినా కుటుంబలంపటం వీటిని ఆలోచింపనీయలేదు. కాలం గడిచింది లంపటాలు వదులినా,వదుల్చుకున్నా, నేటికి ఈ ఆలోచన వచ్చింది,ముందేమి జరగనుందో!

      తొలగించండి
  4. ఈ అనంత విశ్వంలో ఒక మానవుడి విలువ ఎంత?
    మహా సముద్రంలో నీటి బిందువంత.
    ఈ భూమి మీద ఆదిమ మానవడు పుట్టినప్పటినుండి ఇప్పటి వరకు ఎన్నో వేల కోట్ల మంది మానవులు పుట్టారు, మరణించారు.
    ఇంకా పుడుతున్నారు, మరణిస్తున్నారు.
    ఇంతమందిలో చరిత్ర గుర్తు పెట్టుకొన్నది ఎంత మందిని?
    ఈ మొత్తం జరిగిన చరిత్రలో ఎక్కువమందికి తెలిసిన మహానుభావులెవరు?
    మహాత్మా గాంధీ, మధర్ థెరెసా, ఐన్ స్టీన్, న్యూటన్ లేదా మరికొద్ది మంది
    మరి మిగిలిన వారి సంగతి?
    “పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా?” అని మహాకవి వేమన అన్నట్లు
    వారి గురించి ఎవరికీ తెలియదు.
    మరి ఇంతమంది చరిత్ర కెక్కని సామాన్యులు తమ జీవితంలో సాధించేదేమిటి?
    అసలు ఎమీ సాధించని జీవితంకంటే మృతశిశువుగా జన్మించడం ఉత్తమమా?
    మనలో చాలామంది జీవితంలో ఏదో సాధించడం మాట అటుంచి
    ఇంత… అల్పమైన జీవితం కోసం అబద్దాలాడుతూ, మోసాలు చేస్తూ, నానా అగచాట్లు పడుతుంటారు.
    ఇంకా చేతనైనవాళ్ళు దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేస్తూ, ఇతరులను దోచుకుంటూ జీవిస్తున్నారు.
    ఎవరికోసం ఇదంతా? ఎందుకోసం ఇదంతా?
    మంచిగా బతకడం ఈ ప్రపంచంలో అంత కష్టమా? కావచ్చు.
    అయితే అందరూ మంచిగా బతకగలిగే సమాజన్ని ఎవరు సృష్టిస్తారు?
    ఈ కలికాలంలో ఏ దేవుడు దిగి వస్తాడు?
    ఏ మహానుభావుడు మనలని ఉద్దరిస్తాడు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రతి మనిషి ఎదో సాధించడం అవసరం లేదేమో. అది కొందరికే సాధ్యం. ఉన్నంతలో ధర్మంగా న్యాయంగా జీవితం గడిపితే చాలు.
      అసలు ప్రతి మనిషి చరిత్రలో నిలిచి పోయే అవసరం లేదు. జనన మరణ చక్రంలో అలా తిరుగుతూ ఉండక తప్పదు. Perfect society అనేది ఒక్కనాటికి సాధ్య పడదు. మహానుభావులు ధర్మాచార్యులు ఇప్పుడు కూడా ఉన్నారు. వారిని అనుసరిస్తే సమాజం బాగుంటుంది.

      తొలగించండి
    2. బోనగిరి సార్!
      పుడుతున్నారు,చస్తున్నారు. ఎందుకు పుట్టాము? ఎందుకు చస్తున్నాము? అసలు నేనెవరు అనే ప్రశ్న వేసుకోవడం లేదు,అవసరం కనపడటం లేదు,నేటికాలంలో. అంతా డబ్బు,సుఖాలు అనుకునే వాటి వెంబడి ఎండమావుల్లో నీళ్ళు వెతికిన చందాన పరుగులు తీస్తున్నారు. ఎప్పుడో అలసినప్పుడో ఒక్క క్షణం అనిపించినా మళ్ళీ మామూలైపోతాము. ఇదింతే. ఎవరూ ఎవరిని గుర్తుపెట్టుకోరు,గుర్తు పెట్టుకోలేరు. కాని ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న పుడుతుంది,ఆలోచన ఉన్నవారికి,మెట్ట వేదాంతం అనుకునేవారికి చెప్పక్కరలేదనుకుంటాను.

      తొలగించండి
    3. బుచికి సార్!
      మీ తో ద్వివీభవించడం🤣 లేదు,ఏకీభవిస్తున్నాను. కొంత వయసు తరవాతైనా ఇదంతా ఏమిటి అన్న ఆలోచన రావడం సహజం అనుకుంటా.

      తొలగించండి
    4. బుచికి సార్!
      మీ తో ద్వివీభవించడం🤣 లేదు,ఏకీభవిస్తున్నాను. కొంత వయసు తరవాతైనా ఇదంతా ఏమిటి అన్న ఆలోచన రావడం సహజం అనుకుంటా.

      తొలగించండి
    5. ఇది నా బ్లాగులో మొట్టమొదటి పోస్టు సార్, "ఆరంభం" అన్న శీర్షికతో.

      తొలగించండి
    6. బోనగిరి సార్!
      టపా లింక్ ఇవ్వలేదు,మరచారు,లింక్ ఇవ్వండి.

      తొలగించండి
    7. https://bonagiri.wordpress.com/2009/02/16/%e0%b0%86%e0%b0%b0%e0%b0%82%e0%b0%ad%e0%b0%82/

      తొలగించండి
  5. శర్మ గారు, ఎవరో వెకిలిగా అన్నట్లు నాహం మనుష్యో ... అని ఉన్న శ్లోకం మెట్టవేదాంతం కాదండి. ఇది హస్తామలకులవారు శంకరాచార్యుల వారితో చెప్పిన మాటలలోనిది "హస్తామలకస్తోత్రం" పేరుతో ప్రసిధ్ధమైనది.

    మీరు వెకిలిమేళాల మాటలు అనుమతించటం వలన హస్తామలకుల వారిది మెట్టవేదాంతం అనే పిచ్చిమాట అచ్చైనది! తస్మాత్ జాగ్రత.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం సార్!
      మెట్టవేదాంతం అనుకునేవాళ్ళు కూడా ఇక్కడే ఇంకా తిరుగుతున్నారు కనుక ఇదేదో తెలుసుకోవాలనే అభిలాష అనుకుంటాను.😘 ఒకవేళ ఇది పూర్తి వెకిలితనపు మాటే అనుకుంటే హస్తామలక స్తోత్రానికి ఆచార్యులకు వచ్చిన నష్టం లేదు. మనం కోపం తెచ్చుకోవడం అవసరం లేదనుకుంటా. కుక్కకూసుకుంటే జంగం పరపతి పోయిందా? అనేది నానుడి,ఇదంతా తమకు తెలియనిదీ కాదు. చిరాకు కోపం మనకు అవసరం లేదని నా మనవి. ఇక పెద్దలు దీని గురించి చెబుతూ ఉంటారు గాని అదంతా సిద్దంతంలా ఉంటుంది, మీలాటి తెలిసినవారు సుకరం చేసి మాలాటి అజ్ఞానులకు అర్ధమయ్యేలా వాడుక భాషలో చెబితే ధన్యులం. వివరంగా ఇక్కడగాని మీ బ్లాగులో గాని చెప్పగలరు.
      ధన్యవాదాలు.

      తొలగించండి
    2. శర్మ సార్. బాగా చెప్పారు. విశేష అనుభవంతో వచ్చే పరిణితి సాధించిన వారు మీరు.

      జిలేబీ వ్యాఖ్యలను మరీ సీరియస్ గా తీసుకునే అవసరం లేదు. లైట్ తీసుకుంటే సరిపోతుంది. వెటకారం ధోరణి అలా ఉంచితే అనేక విషయాలలో మంచి పరిజ్ఞానం ఉంది జిలేబీకి.

      తొలగించండి
    3. వెకిలిమాటే అనుకుంటే హస్తామలక స్తోత్రానికి ఆచార్యులకు వచ్చిన నష్టం లేదు అనుకోవటం పొరపాటు. అనేక విషయాలలో మంచి పరిజ్ఞానం ఉంది జిలేబీకి అనుకున్నా వెకిలివ్యక్తీకరణలు హర్షణీయం కావు. తనపై ఎంతోకొంత అభిమానం వలన జిలేబీ తెంపరితనం మీకందరకూ ముచ్చటగా ఉంటే కానీయండి. అదటుంచి, పెద్దలను మాటతూలే వారిని గమనించినా, ఆమాటల వలన ఆపెద్దలకు గౌరవభంగం కాదని సరిపుచ్చుకోవటం సరికాదు. అందువలన సమాజంలో కట్టుబాటుకు సముదాచారానికీ విలువే లేకుండా పోతుంది. ఆకతాయిగా ఎవరన్నా ఎవరినైనా ఏమనైనా అనవచ్చును అన్నాక తెంపరితనానికి లైసన్సు ఇచ్చేయటమే అవుతోంది. పోనీయండి మీముచ్చటను కాదనటం వలన నాకేం ప్రయోజనం? విస్తృత సామాజికప్రయోజనం గురించి మంచివేదికలుగా బ్లాగులు ఉండలేవని ఎన్నడో ఋజువైన మాట. గొంగడిలో కూర్చుని తింటూ వెంట్రుకలకు విసుగుకో రాదని మీబోటిపెద్దల ఉవాచ. కానీయండి.

      ఇంతకీ నన్ను ఏవిషయం విశదీకరించ మన్నారో స్పష్టం కాలేదు. ఒకవేళ చెప్పినా అడిగి తాటాకులు కట్టించు కోవటం అవుతుందేమో తెలియటం లేదు. రోటిలో తలదూర్చనా అని సంశయం.

      తొలగించండి
    4. శ్యామలీయం సార్!
      జిలేబి గురించి ఇంత చర్చ అనవసరమని నా మాట. జిలేబి మాట లేకిదని చెప్పడం ఆపై మాట లేక ఊరుకోవడం జరిగింది. మీరు ఆ చర్చను పొడిగించడం అవరమా అని నా మాట. హస్తామలక స్తోత్రమేకాదు, పూరాతనమైన చాలా, చాలా వాటిమీది విషం చిమ్ముతున్న చదువుకున్న మహానుభావులు బ్లాగులో దున్నేస్తూనే ఉన్నారు. వారితో సమానంగా మనమూ పోటీ పడాలి. వీళ్ళని ఏం చేద్దాం? చెప్పండి. సామాజిక ప్రయోజనాలెప్పుడో మట్టిలో కలసిపోయాయి. నేను జిలేబిని పట్టించుకోవడం మానేసాను. మీరు జిలేబిలాటివారిని ఎందుకు వదిలేయలేకపోతున్నారో?

      హస్తామలక స్తోత్రం గురించి వివరిమచమని మిమ్మల్ని అర్ధించా,ఆపై తమ ఇష్టం.

      తొలగించండి
  6. బుచికి4 జూన్, 2026 11:58 AMకి
    బుచికి సార్!
    లోకోభిన్నరుచిః పెద్దలు వారి మాటలకి గౌరవాలు ఎప్పుడో పోయాయి. చదుకున్నమనుకున్నవారు లేకిగా,అసూయా ద్వేషాలతో కులకులలాడుతున్నారు. మానవుడు పుడుతూనే సంస్కారం అబ్బాలి,ఆపై పెరుగుతూ సంపాదించుకోవాలి. సంస్కారం లేనివాళ్ళతో సమ ఉజ్జీగా మాటాడ్తామంటే చేయగలది లేదు. కొద్దిగా సంస్కారం నేర్చుకున్నానేమో సమాజాన్ని చూసి. అప్పుడపుడు సోడా బుడ్డిలో గేస్ తన్నుకొచ్చినట్టు కోపం,చిరాకు వగైరాలన్నీ బయట పడుతూనే ఉన్నాయండి.
    జిలేబిని పట్టించుకోవడం అనవసరం. జిలేబి గురించి ఇంత చర్చా అనవసరమనుకుంటా.

    రిప్లయితొలగించండి
  7. ఇక్కడ వైభవ్ సూర్యవంశీ లెవల్ లో సిక్సర్లు మ్రోగి‌ పోతున్నాయి :)

    మెట్ట వేదాంతం‌ అంటేనే సుర్రు మని టపాకాయలు లక్ష్మీ అవుటులూ పేలిపోతున్నాయి :)

    ఇంకొంచెం ఆజ్యము కావలసినచో వేయగలము ...అగ్మిమీళే ... అనుకుంటూ

    తెలియ జేయగలరు తాతగారు



    ఇట్లు

    ఉడతా భక్తి సేవలో
    తరించెడు ఎల్లెమ్మ :)



    రిప్లయితొలగించండి