ఆబోతుల కుమ్ములాటలో...........
1.కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు.
2.కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టు.
3. అంచుకు తొగరు లేనట్టు
4.కోతికి కొబ్బరికాయ దొరికినట్టు.
5.ఆబోతుల కుమ్ములాటలో లేగదూడల కాళ్ళు విరగదొక్కినట్టు.
6.ఉండలేక సిండ కాల్చుకున్నట్టు.
7.చదవేస్తే ఉన్నమతి పోయినట్టు.
8.పెనం మించి పొయ్యిలో పడ్డట్లు.
9.అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టు.
10.వెదకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు.
11. కుండ వేరైతే గుణం వేరయినట్టు.

బులోగుం తక్కువాయె :)
రిప్లయితొలగించండికొట్టు కొచ్చేరా ?
నానుడులకు సామెతలకు వ్యత్యాస మేమిటండి తాతగారూ ?
Zilebi15 ఏప్రిల్, 2026 10:29 AMకి
తొలగించండినీ బుర్రలో గుంజు ఎండిపోయిందని😜 ఏనాడో చెప్పబడింది,నేడు కొత్తగా కాదు.
నానుడికి సామెతకి తేడా తెలిసినవారికి చెప్పపనిలేదు. తెలియనివారికి చెప్పి ఉపయోగం లేదు.😍
కూసే గాడిద లొచ్చిరి ,
రిప్లయితొలగించండిమేసే గాడిదల గూడ మేయ నియక , తి
ట్టే సే తీరులు గంటిమి ,
ప్రాసలకై ' కూసుముండ ' వరవడి హెచ్చెన్ .
వెంకట రాజారావు . లక్కాకుల15 ఏప్రిల్, 2026 10:39 AMకి
తొలగించండిఅంతా సజాతీయులే అంటారా?
ప్రాసకోసం ఏడ్చేనే కూసుముండా అన్నారట ఒక కవివరులు. ఇదొక నానుడే, కవివరులకే చెందుతుందనుకుంటానండీ