28, జూన్ 2023, బుధవారం

తోలు తిత్తి ఇది

తోలు తిత్తి ఇది 


తోలు తిత్తి ఇది

తూటులు తొమ్మిది

తుస్సుమన ఖాయం

 జీవా తెలుసుకో 

అపాయం! అపాయం!!


పదోది మరిచిపోయారు గురువా!

24 కామెంట్‌లు:

  1. ఉన్నవి చాలక పదవది అంటూ మీరు మరో వైరాగ్య బోధా? ఇంతకీ ఏమిటి శర్మ గారు ఆ పదవది? ఎటునుంచి లెక్క పెట్టినా తొమ్మిదే కదా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావు28 June 2023 at 11:46
      సారూ!
      సమాధానం పెద్దదిగా ఉంటుంది, మన్నించాలి.
      తొమ్మిది కనపడుతూ ఉంటాయి. అందులో ఏడు పైవి (ఊర్ధ్వ ముఖం) రెండు కిందవి( అధో ముఖం). ఈ తొమ్మిది కాక బ్రహ్మ రంధ్రం ఉంది. అది మూసుకుపోయి ఉంటుంది. ఈ ఊర్ద్వ, అధో ముఖాల ద్వారా ఆత్మ బయటికి పోవడం కి మరల జన్మకి లింక్ ఉందంటారు. ఇక గురువు ఈ తొమ్మిది నుంచి బటికి పోవడం ప్రమాదం, ఆత్మ ఈ శరీరం నుంచి తొలగిపోవడం ఖాయం. ఈ తొమ్మిది నుంచి తొలగిపోవడమే ప్రమాదమని చెప్పి ఊరుకున్నారు. అంటే పదో దానిద్వారా బయటపడాలని చెప్పక చెప్పేరనమాట. శిష్యుడు అర్ధం చేసుకోడం లోనే తిరకాసంతా. ఎక్కువచెప్పేనా? మన్నించండి.

      తొలగించండి
  2. ChaalaabaagaacheppaaruedookathututussumanaDaniki

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. Anonymous28 June 2023 at 12:29
      బుజ్జమ్మా! ఒకరెవరో ఒక సారి పొరబాటు చేస్తే అస్తమానం చెయ్యరు. ఇటువంటివి చేసేది నువ్వే! తెలుసుకోలేనా!

      ఛాలాబాగాచెప్పారుఎదూకథుతుతుస్సుమనడనికి
      నువ్వు చెప్పిందిదే!

      నిన్నుపోల్చుకోడమెలా అనికదా నీ సందేహం! విను. "మిట్టపళ్ళాయనా! అంటే మా ఇంట్లో ముండ చెప్పిందా" అని సామెతలే. మొహం మీద కనపడే మిట్టపళ్ళకి ఇంట్లో ఆవిడ చెప్పడమెందుకు? ఇటువంటి పనులు చేసేది నువ్వేనని అందరికీ తెలుసు.

      ఏదో ఒక తూటైతే ఆ గురువంత కష్టపడి చెప్పడమేల?

      తొలగించండి
  3. పంక్చర్ వేయించుకోవడమే...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. Anonymous28 June 2023 at 19:36
      కందమ్మా! నువ్వు తప్పించి ఇలా ఆలోచించగలవారెవరు? పంచర్లేస్తున్నామని కిడ్నీ ఫేల్యూర్, మల్టీ ఆర్గాన్ ఫేల్యూర్ అంటున్నారేం? పంచరేస్తే నిలబడాలిగా :)

      తొలగించండి
    2. పనీపాటా లేనట్టుంది :)
      కందమ్మ బుజ్జమ్మే అన్నిటికి మూలం అంటూ కలవరించేస్తున్నారు :)

      తొలగించండి
    3. శర్మ గారు Telecom Engineer గా పని చేసారన్న విషయం మీకూ తెలుసు కదా, “జిలేబి” గారు? అందువల్ల మీ Anonymous కామెంట్ల మూలం కనుక్కోవడం శర్మ గారికి సులువైన పని.

      తొలగించండి
    4. ఓహో ! అలాగా! జాసూసీ లో గురువులన్న మాట :) తెలియకపోయెనే :)

      తొలగించండి
    5. ఇప్పుడు తెలిసిందిగా (మీకు ఇంతకు ముందే తెలియదంటారా?) - ఇక పై Anonymous comments వారి దగ్గర పెట్టకపోతే మంచిదేమో?

      తొలగించండి
    6. మీరేమన్నా సెక్రటరీ నా అండీ శర్మగారికి :)


      జిలేబి పరార్

      తొలగించండి
    7. అభిమానిని 🤓.
      నేనేం పరార్ అవను … మీలాగా.

      తొలగించండి
    8. Anonymous30 June 2023 at 17:13

      జగడాలమ్మీ!
      "జగడ మెందుకొస్తుంది జగమయ్యా! అంటే బిచ్చం తేవే బొచ్చు ముండా" అని సామెతని మా సౌందరరాజన్ అయ్యోరు చెప్పిండు.
      పుల్లబెట్టకు.
      నీతో జగడమేసుకునే ఓపిక లేదు, ఇప్పుడు.వేడి తట్టుకోలేక ఆరోగ్యం చెడింది.
      నీకేమో సహస్ర నామాల్లా పేర్లెట్టేసేరు, అవసరాన్ని బట్టి. మొన్న తింబు అని పేరెడదామన్నారు, మిత్రులు బోనగిరిగారు. నేనే మరీ తింగరిబుచ్చి అనేది పాత పేరని కాదన్నా! మరో మంచి పేరుకోసం వెదుకుతుంటే ఒకటి దొరికింది, పెట్టెయ్యనా? నేను నీకు పేరెట్టేననుకో మరి మారదు! చూసుకో!! కాసుకో!!! తింగరిబుచ్చి ఖాయం చేసెయ్యమన్నావా? నీ ఇష్టమే "మై ఛాయస్" లాగా.

      మాలికలో నీపక్క టపాలు బిగుసుకుపోయాయి చూసుకో!

      తొలగించండి

    9. విన్నకోట నరసింహా రావు30 June 2023 at 17:39
      మీ అభిమానానికి శతసహస్రకోటి వందనాలు. ఇప్పటికి వేడి తగ్గలేదు ౩౭ ఉంది. వేడికి కొత్తగా ఆరోగ్యం చెడింది, మరింతగా, వారంలో. అందుకే ఈ టపా గుర్తొచ్చింది.
      పునః వందనం

      తొలగించండి
    10. తాతగారి ఉభయంతో మూడు కందాలు గిట్టుబాటయ్యేయి ఇప్పటికి! అతి త్వరలో శతకమ్మునకు వచ్చును :)


      జిలేబి

      తొలగించండి
    11. -
      వీరాభిమానినని కత
      లేరాళము కట్టవలదుడీ! వారికి స
      త్కార సభ ఘనముగ జరుపు
      డీ! రా రమ్మ యని నెల్లరిని పిలవండీ !

      గిట్టుబాటేమైనా జరుగునా ?


      జిలేబి

      తొలగించండి
    12. సన్మాన సభలో చదవడానికి శర్మ గారి మీద మీరు పంచరత్నాలు వ్రాసి తీసుకొచ్చి చదివితే …. అదే మీకు “గిట్టుబాటు”.

      తొలగించండి
    13. ఎంత మాట ఎంత మాట ! మీరడిగితే పంచపిష్టకములేంటి దశకరీషములైనా ఓకే.

      సభాహ్వానం పంపండీ ! తయారై వచ్చేస్తాము :)


      జిలేబి

      తొలగించండి

    14. Zilebi30 June 2023 at 19:45
      ఉభయం, ఉభయములు మాటలు వాడేవుగా అర్ధo ఏంటో చెప్పు చూదాం.

      తొలగించండి
    15. అభయంబులిచ్చు మా యిభరాజవరదునకుభయంబులొనరింపు చున్నవారు." [ప్రబంధ. 55ప.]

      తొలగించండి
    16. Zilebi1 July 2023 at 20:00
      సరిపోయె! ఆయనుంటే మంగలెందుకూ? అన్నది పాతకాలం సామెత. అర్ధమైతే నిన్నడగడమెందుకంట?

      తొలగించండి
  4. బ్రహ్మరంధ్రం నుండి ప్రాణం రావడమే కానీ, పోవడం అందరికీ సాధ్యం కాదనుకుంటాను? అందుకే గురువు పాటలో తొమ్మిది గురించే పాడారు?

    రిప్లయితొలగించండి

  5. కాంత్28 June 2023 at 22:40
    మీరు చెప్పినమాట నిజం. గురువు చెప్పినది నిజం, శిష్యుడు అర్ధం చేసుకోడంలోనే తిరకాసంతా!

    రిప్లయితొలగించండి