బావా బావా పన్నీరు
బావను పట్టుకు తన్నేరు
పట్టెడ మంచం వేసేరు
పది గుద్దులు గుద్దేరు
పందిరి గుంజకి కట్టేరు
పాతిక గుద్దులు గుద్దేరు
నులక మంచం వేసేరు
నూరు గుద్దులు గుద్దేరు
చావిడి చూరుకి కట్టేరు
చప్పిడి గుద్దులు గుద్దేరు.
వీశెడు గంధం పూసేరు
వీశె గుద్దులు గుద్దేరు.
వీశెడు గంధం పూసేరు
వీధి వీధి తిప్పేరు,
బావా బావా పన్నీరు
బావను పట్టుకు తన్నేరు.
తంతే బావా ఊర్కోడు
తాళి కట్టి లాక్కెళ్తాడు.