Sunday, 24 January 2016

Saturday, 23 January 2016

Thursday, 21 January 2016

దుర్గాలయం (రామ్ నగర్) వారణాశి-1860

Courtesy: Old Indian photos  దుర్గాలయం రామ్ నగర్ వారణాశి-1860

Sunday, 17 January 2016

అమ్మవారికి నైవేద్యం

అమ్మవారికి నైవేద్యం

అన్నం మూడు కరుళ్ళు
పప్పు మూడు ముద్దలు
కూర మూడు ముద్దలు
పొంగు బూరెలు
గారెలు
వడపప్పు (ఫోటో లో కనపడలేదు)
పానకం.
అరటిపళ్ళు

వీటిని వేడిగా ఉండగా నైవేద్యం పెట్టి చాకలికి వేదిగా ఉండగానే ఇస్తారు. చద్ది నైవేద్యమూ పెడతారు అది మరోసారి.
  

Friday, 15 January 2016

భోగి చిత్రాలు





మకర సంక్రమణ శుభకామనలు


పల్లెలలో కూడా రంగవల్లులు తగ్గేయి. మట్టి పెరడు దానిమీద కళ్ళాపి జల్లి తెల్లటి ముగ్గు వేసిన ముంగిలిలేదు. అంతా సిమెంటు మయం. హరిదాసులజాడ లేదు, కొమ్మదాసర్లు కనుమరుగై చాలా కాలమే అయింది, అసలు పల్లెలలో కూడా ఊరిలో చెట్లే కరువయ్యాయి. మా పల్లెలో నాలుగేళ్ళకితంవరకు మైన్ రోడ్ లో ఇరవి చెట్లుండేవి, సిమెంట్ రోడ్ కోసం అన్నీ కొట్టేశారు. బసవన్నల సందడే లేదు. కోడి పందాలు మాత్రం జోరుగా ఉండేలాగే ఉంది, మందు షాపులకి గిరాకీ జోరుగా ఉంది, ఇది నేటి పల్లెలలో సంక్రాంతి. భోగి మంటలే తప్పించి గొబ్బిళ్ళు లేవు. ఆడపిల్లలు ఆవుపేడ ముట్టుకోడానికి అసహ్య పడుతున్న రోజులు